Share News

హైదరాబాద్‌లో డ్రాపర్‌ స్టార్టప్‌ హౌస్‌

ABN , First Publish Date - 2023-11-21T01:31:04+05:30 IST

స్టార్ట్‌పలకు వివిధ రకాల సేవలు అందిస్తున్న డ్రాపర్‌ స్టార్టప్‌ హౌస్‌ హైదరాబాద్‌లో అతిపెద్ద గ్లోబల్‌ కో-లివింగ్‌, కో-వర్కింగ్‌ సదుపాయాన్ని...

హైదరాబాద్‌లో డ్రాపర్‌ స్టార్టప్‌ హౌస్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్టార్ట్‌పలకు వివిధ రకాల సేవలు అందిస్తున్న డ్రాపర్‌ స్టార్టప్‌ హౌస్‌ హైదరాబాద్‌లో అతిపెద్ద గ్లోబల్‌ కో-లివింగ్‌, కో-వర్కింగ్‌ సదుపాయాన్ని ప్రారంభించింది. స్టార్ట్‌పలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలిసి ఉండి.. సహకరించుకోవడానికి ఈ సదుపాయం దోహదపడుతుంది. హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించే వాతావరణం ఉంది. ఇక్కడి మార్కెట్లోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని డ్రాపర్‌ స్టార్టప్‌ హౌస్‌ వ్యవస్థాపకుడు విక్రమ్‌ భారతి అన్నారు. డ్రాపర్‌ స్టార్టప్‌ హౌస్‌ ఇప్పటికే బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Updated Date - 2023-11-21T01:31:06+05:30 IST