Share News

Bangalore: చంద్రబాబుకు బెయిల్‌పై ప్రవాసాంధ్రుల సంబరాలు

ABN , First Publish Date - 2023-11-21T11:23:41+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)కు

Bangalore: చంద్రబాబుకు బెయిల్‌పై ప్రవాసాంధ్రుల సంబరాలు

బెంగళూరు/బళ్లారి, (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)కు స్కిల్‌ డెవలెప్‏మెంట్‌ కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు కావడంతో బెంగళూరు, బళ్లారి(Bangalore, Bellary)లో నివసించే తెలుగుదేశం పార్టీ అభిమానులు, ప్రవాసాంధ్రులు సంబరాలు చేసుకున్నారు. యలహంకలో సోమవారం రాత్రి చేనేత కార్మిక సంఘం నాయకుడు చిన్నప్ప, ఏపీ ఖాదీ బోర్డు మాజీ డైరెక్టర్‌ పాపన్న ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుని కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా చిన్నప్ప, పాపన్న మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అరాచక విధానాలకు పాల్పడుతోందన్నారు. చంద్రబాబును వేధించాలనే అరెస్టు చేయించారని పేర్కొన్నారు. ఇటీవల ఆరోగ్యానికి సంబంధించి బెయిల్‌పై వచ్చిన చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయడం సంతోషదాయకమన్నారు. చంద్రబాబు రాష్ట్ర పర్యటనలో ప్రజల అభిమానాన్ని, యువగళం పాదయాత్రకు వస్తున్న స్పందనను ఓర్వలేకనే అరెస్టు చేయించారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన అభిమానులు లోకేశ్‌, నర్రే వెంకట శివచిన్నప్ప, రాజశేఖర్‌, నాగిరెడ్డి, ఓడీసీ బాబా, రమణారెడ్డి, అప్పిరెడ్డి, కిశోర్‌, మీసాలరెడ్డి, సుధాకరరెడ్డి, రామేశ్వరరెడ్డి, అశోక్‌, రవీంద్ర, శివ, ఉత్తప్ప తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు కావడంతో బళ్లారిలోని విద్యానగర్‌ వద్ద ఉన్న అమూల్‌ నివాస్‌ వద్ద ప్రవాసాంద్రులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కమ్మసంఘం నాయకులు గుర్రం లాల్‌ మోహన్‌, ధర్మవరపు చిన్నప్పయ్య, కుడితిని శ్రీనివాసులు, బాలాజీ ల్యాబ్‌ రాయంకి రామానాయుడు, ఈశ్వరయ్య, హరిబాబు, కామళ్లపాడు విజయకుమార్‌, భాస్కర్‌, జగదీశ్‌, లక్ష్మినారాయణ, గుర్రం మోహన్‌దా్‌స, గురుప్రసాద్‌, కోనంకి రవి, ప్రకాష్‌, చింబిలి ప్రకాష్‌, ముత్తలూరు రమణ, వెంకటేశులు, బాబు, నాని, లత్తవరం మల్లికార్జున, శివలింగప్ప తదితర ప్రవాసాంధ్రులు మిఠాయిలు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కమ్మసంఘం నాయకుడు గుర్రం లాల్‌ మోహన్‌ మాట్లాడుతూ చంద్రబాబుపై కేవలం రాజకీయ కుట్రతోనే కేసులు పెట్టారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ అడ్రస్‌ లేకుండా పోతుందన్నారు. సీఎం జగన్‌రెడ్డి అరాచక, దుర్మార్గపు, అవినీతి పాలన, కక్షసాధింపులతో జనం విసిగెత్తిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు.

Updated Date - 2023-11-21T11:23:43+05:30 IST