కోచింగ్ సెంటర్లను మూసివేయించలేం
ABN , First Publish Date - 2023-11-21T04:09:24+05:30 IST
పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లను మూసివేయించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. తీవ్రమైన పోటీ, తల్లిదండ్రులు పెడుతున్న ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అభిప్రాయపడింది.

న్యూఢిల్లీ, వనంబరు 20: పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లను మూసివేయించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. తీవ్రమైన పోటీ, తల్లిదండ్రులు పెడుతున్న ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అభిప్రాయపడింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కోచింగ్ సెంటర్లను నియంత్రించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టిల ధర్మాసనం విచారణ జరిపింది. కొచింగ్ సెంటర్లను మూసివేయాలనడం చిన్నవిషయం ఏమీ కాదని అభిప్రాయపడింది. కోర్టులు అలాంటి ఉత్తర్వులను ఎలా ఇస్తాయని ప్రశ్నించింది. తీవ్రమైన పోటీ కారణంగా విద్యార్థులు కోచింగ్ సెంటర్లకు వెళ్లక తప్పడం లేదని తెలిపింది. తగిన పరిష్కారం కోసం ప్రభుత్వాన్నే సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.