Share News

యూఎఫ్‌వో కోసం రాఫెల్స్‌తో వేట

ABN , First Publish Date - 2023-11-21T04:14:27+05:30 IST

మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వస్తువు (యూఎ్‌ఫవో) గాల్లో ఎగరడం తీవ్ర కలకలం రేపింది.

యూఎఫ్‌వో కోసం రాఫెల్స్‌తో వేట

న్యూఢిల్లీ, నవంబరు 20: మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వస్తువు (యూఎ్‌ఫవో) గాల్లో ఎగరడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆ వస్తువు ఏమిటనేది గుర్తించేందుకు భారత వాయుసేన (ఐఏఎఫ్‌) అధునాతన రాఫెల్‌ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. దగ్గరలోని హసిమరా వైమానిక స్థావరం నుంచి రెండు రాఫెల్‌ యుద్ధ విమానాలను వదిలి ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలించింది. అయితే.. ఈ ఫైటర్‌ జెట్లు ఏమీ గుర్తించలేకపోయాయని ఉన్నత వర్గాలు సోమవారం పేర్కొన్నాయి. మరోవైపు గుర్తుతెలియని వస్తువు కనిపించడంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని కొద్దిసేపు మూసివేశారు. దీంతో విమానాల రాకపోకలకు 3 గంటలు అంతరాయం ఏర్పడింది.

బదిలీ అయిన జడ్జిలకు వీడ్కోలు

తెలంగాణ హైకోర్టు నుంచి కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్‌ సుమలత, మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్‌ ముమ్మినేని సుధీర్‌కుమార్‌కు జడ్జిలు, న్యాయవాదులు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు.

Updated Date - 2023-11-21T07:17:58+05:30 IST