Share News

Ministers: మంత్రికి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.. బెయిల్‌ ఇవ్వండి ప్లీజ్‌..

ABN , First Publish Date - 2023-11-21T08:25:36+05:30 IST

రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజీ(Minister Senthil Balaji)కి పక్షవాతం వచ్చే అవకాశముందని, ఆయన ఆసుపత్రిలో

Ministers: మంత్రికి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.. బెయిల్‌ ఇవ్వండి ప్లీజ్‌..

- సుప్రీంకోర్టులో అభ్యర్థన

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజీ(Minister Senthil Balaji)కి పక్షవాతం వచ్చే అవకాశముందని, ఆయన ఆసుపత్రిలో ఉండి మెరుగై న చికిత్స చేయించుకునేందుకు అనువుగా బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. చట్టవ్యతిరేక నగదు బదిలీ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ద్వారా అరెస్ట యి, జైలులో ఉన్న రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజి బెయిలు కోరే అప్పీలు పిటిషన్‌ విచారణ సోమవారం సుప్రీంకోర్టులో జరిగింది. ఈ నేపథ్యంలో, జైలులో ఉన్న సెంథిల్‌ బాలాజి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోవడం తదితర సమస్యలతో గతవారం ఓమందూర్‌ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సోమవారం బెయిలు పిటిషన్‌ విచారణకు వచ్చిన సమయంలో, ఆరోగ్య కారణాల రీత్యా సెంథిల్‌ బాలాజీకి బెయు లు మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. అలాగే, ఆయనకు తీసిన ఎంఆర్‌ఐ స్కాన్‌లో పక్షవాతం వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోందని వివరించారు. ఇంతలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ త్రివేది... మంత్రి సెంథిల్‌ బాలాజీకి తీసిన ఎంఆర్‌ఐ రిపోర్ట్‌ ఏదని ప్రశ్నించారు. సెంథిల్‌ బాలాజి చికిత్స వివరాలను సమర్పించామని, ఆయనను పర్యవేక్షించడం, అవసరమైన వైద్యచికిత్సలు అందించాల్సి ఉండడంతో బెయిలు మంజూరు చేయాలని సెంథిల్‌ బాలాజి తరఫు న్యాయవాది కోరారు. దీంతో, సెంథిల్‌ బాలాజీకి అందిస్తున్న వైద్యచికిత్సలు వివరాలతో కూడిన నివేదిక దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి, తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.

nani3.2.jpg

మంత్రికి కొనసాగుతున్న వైద్యపరీక్షలు

స్థానిక ఓమందూర్‌ ప్ర భుత్వాసుపత్రిలో మంత్రి సెంథిల్‌ బాలాజీకి సోమవారం వైద్యపరీక్షలు కొనసాగాయి. పుళల్‌ జైల్లో ఉన్న ఆయన రెండు రోజుల క్రితం స్పృహతప్పి పడిపోతుండడంతో పోలీసు బందోబస్తు నడు మ స్టాన్లీ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ ఎక్స్‌రే, ఈసీజీ, రక్తపరీక్షలు నిర్వహించగా, గుండె కు సంబంధించిన పరీక్షలకు ఓమందూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన వైద్యపరీక్షల్లో మెదడులోని చిన్న నాళంలో రక్తం గడ్డకట్టినట్లు పరీక్షల్లో తేలడంతో, ఆ సమస్యకు వైద్యులు చికిత్సలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సోమవారం ఆయనకు కాలేయం, పేగు, హృద్రోగ శస్త్రచికిత్స నిపుణులు వైద్యపరీక్షలు నిర్వహించారు. అలాగే, మెడ వెనుక భాగంలో తలెత్తిన సమస్యకు చికత్సలందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు

Updated Date - 2023-11-21T08:25:38+05:30 IST