3.8 కి.మీ దూరాన టార్గెట్ హతం
ABN , First Publish Date - 2023-11-21T04:11:34+05:30 IST
ఓ ఉక్రెయిన్ స్నైపర్ ఏకంగా 2.5 మైళ్ల (3.8 కి.మీ.) దూరంలోని రష్యన్ సైనికుడిని కాల్చి చంపి కొత్త రికార్డు సృష్టించాడు.

ఉక్రెయిన్ స్నైపర్ ప్రపంచ రికార్డు
కీవ్, నవంబరు 20: ఓ ఉక్రెయిన్ స్నైపర్ ఏకంగా 2.5 మైళ్ల (3.8 కి.మీ.) దూరంలోని రష్యన్ సైనికుడిని కాల్చి చంపి కొత్త రికార్డు సృష్టించాడు. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసె్‌సకు చెందిన ఓ సైనికుడు ఇటీవల ఈ ప్రపంచ రికార్డు నెలకొల్పినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అంతకుముందు కెనడా స్పెషల్ ఫోర్సె్‌సకు చెందిన ఓ సైనికుడి పేరు మీద ఈ రికార్డు ఉంది. 2017లో అతడు ఇరాక్‌లో 3.54 కిలోమీటర్ల దూరంలోని శత్రువుని మట్టుబెట్టాడు. ఇక 2009లో ఓ బ్రిటిష్ స్నైపర్ అఫ్ఘానిస్థాన్‌లోని ఓ తాలిబన్‌ను 2.47 కిలోమీటర్ల దూరం నుంచి కాల్చి చంపాడు.