Share News

Keel Build Toucan : మీకు తెలుసా?

ABN , First Publish Date - 2023-11-20T23:04:50+05:30 IST

పసుపు, ఆకుపచ్చ, నలుపు, ఆరెంజ్‌, ఎరుపు రంగుల్లో ముక్కు ఉంటుంది. ఆ ముక్కు ఇంద్రధనస్సును తలపిస్తుంది. ఈ అందమైన పక్షి పేరు కీల్‌ బిల్డ్‌ టూకాన్‌.

 Keel Build Toucan : మీకు తెలుసా?

  • పసుపు, ఆకుపచ్చ, నలుపు, ఆరెంజ్‌, ఎరుపు రంగుల్లో ముక్కు ఉంటుంది. ఆ ముక్కు ఇంద్రధనస్సును తలపిస్తుంది. ఈ అందమైన పక్షి పేరు కీల్‌ బిల్డ్‌ టూకాన్‌. రైన్‌బో టూకాన్‌ అని కూడా పిలుస్తారు.

  • దక్షిణ అమెరికా, దక్షిణ మెక్సికో, కరీబియన్‌ అడవుల్లో ఎక్కువగా ఉంటాయివి. చెట్టు తొర్రల్లో, ఇతర పక్షుల గూళ్లలో జీవిస్తుంటాయి. పురుగులు, బల్లులు, ఇతర పక్షుల గుడ్లు, పండ్లు తింటాయి.

  • ఇవి రెండు నుంచి 4 గుడ్లు పెడతాయి. 20 రోజులు పొదుగుతాయి.

  • ఈ పక్షికి ముక్కు అందం. శరీరం 50 సెం.మీ పొడవుంటే అందులో 20 సెం.మీ. ముక్కు ఉంటుంది. ఇది అందమైనది. సున్నితమైనది కూడా. ఈ ముక్కుతో గొడవపడటం, మట్టిని తవ్వడం చేయలేదు. దక్షిణ అమెరికాలోని చెట్లమధ్య సులువుగా జీవించటానికి వీలుండేట్లు డిజైన్‌ అయిందా అన్నట్లు అనిపిస్తుంది. ఇవి నలభై జాతులున్నాయి.

  • వీటి రెక్కలతో ఇవి పైకి ఎగరలేవు. ఒక చెట్టుమీద నుంచి మరో చెట్టు మీదకు ఎగురుతాయంతే.

  • 20 ఏళ్లు జీవిస్తాయి.

Updated Date - 2023-11-20T23:05:00+05:30 IST