Eggs Benefits: రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా ?
ABN, First Publish Date - 2023-11-15T19:38:24+05:30 IST
రోజూ ఒక గుడ్డు తింటే అనారోగ్యం దరిచేరదనే మాట తరచూ వింటూ ఉంటాం. అయితే ఎక్కువ గుడ్లు తినడం వల్ల అనేక రకాల.....

రోజూ ఒక గుడ్డు తింటే అనారోగ్యం దరిచేరదనే మాట తరచూ వింటూ ఉంటాం. అయితే ఎక్కువ గుడ్లు తినడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు రోజుకు ఎన్ని గడ్లు తింటే ఆరోగ్యానికి మందిదనే వివరాలు తెలుసుకుందాం.

కోడి గుడ్లలో కోలిన్, ఫోలేట్, విటమిన్-డి, అయోడిన్, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయినా వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రరిణామాలు కూడా ఉన్నాయి. కొలెస్ట్రాల్ సమస్య ఉన్న వారు గుడ్లు ఎక్కువ తినకూడదు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

రక్తపోటు ఎక్కువగా ఉన్నా వారు కూడా గుడ్లు ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే గుడ్డులోని పనుసు భాగాన్ని పక్కకు తీసేసి, మిగతా భాగాన్ని తినడం మంచిది. పసుపు భాగంలో కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల అధిక రక్తపోటు ఉన్నవారికి ఇబ్బంది కలగవచ్చు.

అదే విధంగా గుడ్లు ఎక్కువగా తినడం వల్ల బరువు కూడా ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంది. అలాగే శరీరంలో అధిక వేడిని కలిగిస్తాయి. మరోవైపు కడుపులో వికారం, తిమ్మిర్ల సమస్య కూడా తలెత్తవచ్చు. అదేవిధంగా బీపీ కూడా పెరిగి ప్రమాదం ఉంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం వారానికి 7 నుంచి 10 గుడ్లు తినడం ఉత్తమం. అయితే ఎక్కువ వర్కవుట్లు చేసేవారు, ప్రొటీన్లు ఎక్కువగా అవసరమయ్యే వారు 4 నుంచి 5 గుడ్లు ఎక్కువ తిన్నా సమస్య ఉండదు. అయితే తెల్లసొన మాత్రమే తినడం వల్ల భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
Updated at - 2023-11-15T19:45:32+05:30