Share News

Costliest Towel: ఈ టవల్ ఖరీదు ఏకంగా రూ.77 వేలు.. చిన్నదే కానీ ఎందుకంత రేటు అని ఆరా తీస్తే..!

ABN , First Publish Date - 2023-11-20T18:12:09+05:30 IST

ఫ్యాషన్ ప్రపంచంలో లగ్జరీ బ్రాండ్‌లకు ఉండే క్రేజే వేరు. సినిమా సెలబ్రిటీలు, ధనవంతులు ఆయా బ్రాండ్లను వాడేందుకు ఎగబడుతుంటారు. ఇటలీ, స్పెయిన్ ఇలాంటి లగ్జరీ బ్రాండ్లకు బాగా ప్రసిద్ధి. కేవలం బట్టలు మాత్రమే కాదు.. ఆయా బ్రాండ్‌ల హ్యాండ్ బ్యాగ్‌లు, చెప్పులు, టవల్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోతుంటాయి.

Costliest Towel: ఈ టవల్ ఖరీదు ఏకంగా రూ.77 వేలు.. చిన్నదే కానీ ఎందుకంత రేటు అని ఆరా తీస్తే..!

ఫ్యాషన్ (Fashion) ప్రపంచంలో లగ్జరీ బ్రాండ్‌లకు (Luxury Brands) ఉండే క్రేజే వేరు. సినిమా సెలబ్రిటీలు, వ్యాపారస్థులు, ధనవంతులు ఆయా బ్రాండ్లను వాడేందుకు ఎగబడుతుంటారు. ముఖ్యంగా ఇటలీ (Italy), స్పెయిన్ (Spain) ఇలాంటి లగ్జరీ బ్రాండ్లకు బాగా ప్రసిద్ధి. కేవలం బట్టలు మాత్రమే కాదు.. ఆయా బ్రాండ్‌ల హ్యాండ్ బ్యాగ్‌లు, చెప్పులు, చివరకు టవల్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోతుంటాయి. వాటిల్లో అంత స్పెషాలిటీ ఏముందో ఎవరికీ అర్థం కాదు. ప్రస్తుతం అలాంటి టవల్ (Costliest Towel) ఒకటి పెద్ద చర్చనీయాంశంగా మారింది.

స్పెయిన్‌కు చెందిన బలెన్సియాగా (Balenciaga) అనే లగ్జరీ బ్రాండ్ అంటే ఫ్యాషన్ ప్రియులు ఎంతో ఇష్టపడుతుంటారు. ఆ కంపెనీ ఉత్పత్తులను వాడేందుకు మక్కువ చూపుతారు. ఈ సంస్థ రాబోయే వసంతకాలానికి సంబంధించిన కలెక్షన్‌ను (Spring collection) ఇటీవల ప్రారంభించింది. అందులో భాగంగా ఓ టవల్‌ను అమ్మకానికి ఉంచింది. ఈ టవల్ ధరను ధర 925 డాలర్లు (77 వేల రూపాయలు)గా నిర్ణయించింది. ఓ సాధారణ తువ్వాలును ఇంత భారీ ధరకు అమ్మడం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

Viral: ఒకప్పుడు క్రికెట్ టీమ్ కెప్టెన్.. రూ.2000 కోట్లతో తీసిన సినిమాలోనూ నటించిన ఈ వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా..?

ఈ టవల్‌కు సంబంధించిన ఫొటోలు, ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై చాలా మంది నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఈ టవల్‌కు నేను రూ.100 కూడా ఇవ్వను``, ``ఇలాంటివి ఎవరు కొంటారు``, ``దీనిలో అంత స్పెషల్ ఏముంది``, ``ఈ టవల్ కొని తుడుచుకుంటే కళ్లలో నుంచి నీళ్లు వస్తాయి`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-20T18:12:11+05:30 IST