Viral Video: ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ ఎవరో.. అసలు ఆమె ఎక్కడ ఉందో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-11-20T20:41:20+05:30 IST
కనీస వసతులులేని ఓ గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో బాధ్యతలు తీసుకునేందుకు వచ్చిన టీచర్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: మనిషి జీవితంలో ఎదగాలంటే విద్య ఎంతో కీలకం. చదువుతో పేదరికాన్ని జయించవచ్చు. కానీ, మన దేశంలో ఇప్పటికీ గ్రామీణ విద్యార్థులకు సరైన వసతులతో కూడిన విద్య అందని ద్రాక్షగానే మిగిలుంది. ఓవైపు, ధనిక, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకెళుతుంటే ప్రభుత్వ పాఠశాలలే దిక్కైన పేద విద్యార్థులు మాత్రం వెనకబడిపోతున్నారు. సరైన వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు నేటి కాలానికి తగిన నైపుణ్యాలు అందించడంలో విఫలమవుతున్నాయి. ఇది దేశ ప్రగతికే ప్రతిబంధకంగా మారుతోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియో(Viral Video) నెటిజన్లకు ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను కళ్లకుకట్టినట్టు చూపిస్తోంది.
Viral: నేను వరల్డ్ కప్ మ్యాచ్ చూడను.. ఆనంద్ మహింద్రా సంచలన ప్రకటన..కారణం తెలిస్తే..
బీహార్‌లో(Bihar) ఈ వీడియో వెలుగు చూసింది. ఇందులో ఓ ప్రభుత్వ టీచర్.. ఉద్యోగంలో చేరేందుకు ఓ మారుమూల గ్రామానికి వెళ్లింది(Govt teacher joins school in remote village). ఆ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను రెండు గుడిసెల్లో ఏర్పాటు చేశారు. ఇక కొత్త టీచర్ నేల మీద కూర్చునే తన నియామక పత్రాలపై సంతకం చేశారు. ప్రిన్సిపాల్ కూడా కింద కూర్చునే ఆమె డాక్యుమెంట్లను చెక్ చేశారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి చుట్టూ ఉన్న పరిసరాలను రికార్డు చేయడంతో ప్రభుత్వ స్కూలు పరిస్థితి వెలుగులోకి వచ్చింది. గుడిసెల్లో నిర్వహిస్తున్న ఆ స్కూలుకు సరైన వసతులు కూడా లేనట్టు కనిపించింది.
వీడియో చూసిన నెటిజన్లు పాఠశాల పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తు్న్న ప్రిన్సిపాల్ మళ్లీ జీతం పడే నాటికే కనిపిస్తారంటూ కొందరు కామెంట్ చేశారు. విద్య, వైద్యం లాంటి వాటిని ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేసి తమ బాధ్యత నుంచి చేతులు దులుపుకున్నాయని కొందరు కామెంట్ చేశారు.