వైజాగ్ చేరిన క్రికెటర్లు
ABN , First Publish Date - 2023-11-21T02:27:33+05:30 IST
ఆసీ్‌సతో ఈనెల 23న ఇక్కడ జరగనున్న తొలి టీ20లో పాల్గొనే భారత ఆటగాళ్లు సోమవారం ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకున్నారు...

విశాఖపట్నం (స్పోర్ట్స్): ఆసీ్‌సతో ఈనెల 23న ఇక్కడ జరగనున్న తొలి టీ20లో పాల్గొనే భారత ఆటగాళ్లు సోమవారం ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకున్నారు. కెప్టెన్ సూర్యకుమార్‌యాదవ్ మంగళవారం రానున్నాడు. కాగా సోమవారం సాయంత్రం నెట్ ప్రాక్టీస్ చేయడానికి స్టేడియానికి వచ్చిన భారత ఆటగాళ్లకు వర్షం ఆటంకం కల్పించింది. దీంతో వారంతా డ్రెస్సింగ్ రూమ్‌లో కొద్దిసేపు కూర్చొని తిరిగి హోటల్‌కు చేరుకున్నారు. ఆస్ర్టేలియా ఆటగాళ్లు మధ్యాహ్నం మూడు గంటలకు స్టేడియానికి చేరుకుని కొద్దిసేపు ఫిట్‌నెస్ ప్రాక్టీస్ చేశారు.