MLA Seethakka : నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ కుట్రలు..
ABN , First Publish Date - 2023-11-21T10:02:01+05:30 IST
తనను ఓడించేందుకు బీఆర్ఎస్ పెద్దలు అనేక కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈవీఎంలలో తన ఫోటో, గుర్తు సైజు తగ్గించారన్నారు. దీనిపై మా కార్యకర్తలు అర్థరాత్రి వరకూ నిరసన తెలిపారన్నారు. జిల్లా కలెక్టర్ బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు.

ములుగు : నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ పెద్దలు అనేక కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈవీఎంలలో తన ఫోటో, గుర్తు సైజు తగ్గించారన్నారు. దీనిపై మా కార్యకర్తలు అర్థరాత్రి వరకూ నిరసన తెలిపారన్నారు. జిల్లా కలెక్టర్ బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ కండువా లేని బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నారని సీతక్క పేర్కొన్నారు.
మహిళా కలెక్టర్ అని గౌరవం ఇస్తున్నామని.. అయినా ఆమె బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు. కలెక్టర్‌పై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. తనను ఓడించేందుకు అనేక కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రజలకు మద్దతుగా ఉండే తనను అణచివేసి ఇక్కడి వనరులను దోచుకోవాలని చూస్తున్నారన్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీతక్క పేర్కొన్నారు.