Ponguleti Srinivasa Reddy : కేసీఆర్ ధన బలం, ప్రజా బలానికి మధ్య పోరాటమే ఈ ఎన్నికలు
ABN , First Publish Date - 2023-11-21T11:12:20+05:30 IST
కేసీఅర్ ధన బలానికి.. ప్రజా బలానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేడు ఆయన చర్లలో జరిగిన కాంగ్రెస్ పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు.

ఖమ్మం : కేసీఅర్ ధన బలానికి.. ప్రజా బలానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేడు ఆయన చర్లలో జరిగిన కాంగ్రెస్ పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులు మోస పోయారన్నారు. కరెంట్ విషయంలో కేసీఆర్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు చూపిస్తున్నాయన్నారు. భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి పొదేం వీరయ్యను గెలిపించాలని పొంగులేటి పిలుపునిచ్చారు.