Tummala Nageswara Rao: ప్రభుత్వం దేవుడికి ఇచ్చిన మాట తప్పింది
ABN , First Publish Date - 2023-11-21T10:51:41+05:30 IST
ఈ ప్రభుత్వం దేవుడికి ఇచ్చిన మాట తప్పిందని మాజీ మంత్రి తుమ్మల నాగేవ్వరరావు అన్నారు. నేడు చర్లలో కాంగ్రెస్ పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. సాక్షాత్తు శ్రీ రాముడు కొలువైన ఆలయం అభివృద్ధి పనులు వాగ్దానం అమలు కాలేదన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం : ఈ ప్రభుత్వం దేవుడికి ఇచ్చిన మాట తప్పిందని మాజీ మంత్రి తుమ్మల నాగేవ్వరరావు అన్నారు. నేడు చర్లలో కాంగ్రెస్ పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. సాక్షాత్తు శ్రీ రాముడు కొలువైన ఆలయం అభివృద్ధి పనులు వాగ్దానం అమలు కాలేదన్నారు.
గోదావరి వరద బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్యులు ఎన్టీఆర్ రాజకీయ అవకాశం ఇచ్చారని తుమ్మల పేర్కొన్నారు. భద్రాచలం డివిజన్‌లో గిరిజనులు, ఆదివాసుల అభివృద్ధికి కృషి చేశానన్నారు. భద్రాచలం కరకట్ట హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణంతో నాగరిక అభివృద్ధి వైపు నడిపించానన్నారు. తమపై నమ్మకం ఉంటే భద్రాచలం ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్యను గెలిపించాలని తుమ్మల కోరారు.