నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ కుట్ర: సీతక్క

ABN, First Publish Date - 2023-11-21T11:26:19+05:30 IST

ములుగు జిల్లా: నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ములుగు నియోజకవర్గం అభ్యర్థుల ఫోటోల ముద్రణపై సీతక్క ఆందోళన చేశారు. ఈవీఎంలలో తన ఫోటో గుర్తు సైజు తగ్గించారని ఆరోపించారు.

ములుగు జిల్లా: నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ములుగు నియోజకవర్గం అభ్యర్థుల ఫోటోల ముద్రణపై సీతక్క ఆందోళన చేశారు. ఈవీఎంలలో తన ఫోటో గుర్తు సైజు తగ్గించారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ బీఆర్ఎస్‌కు అనుకూలంగా పని చేస్తున్నారని సీతక్క అన్నారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు కూడా ఇవ్వకుండా తనకు చెడ్డపేరు తీసుకురావాలని చేస్తున్నారన్నారు. తనను ఓడించేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని సీతక్క మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-21T11:27:17+05:30