జగనే అత్యంత ఆర్థిక నేరస్థుడు: పిల్లి మాణిక్యరావు

ABN, First Publish Date - 2023-11-21T09:41:04+05:30 IST

అమరావతి: సత్యమేవ జయతే అనే మాటకు నమ్మకం ఏర్పడిందని ఏపీ టీడీపీ స్పోక్స్ పెర్సన్ పిల్లి మాణిక్యరావు అన్నారు. సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టి.. ఉన్మాద ఆనందాన్ని పొందారని మండిపడ్డారు.

అమరావతి: సత్యమేవ జయతే అనే మాటకు నమ్మకం ఏర్పడిందని ఏపీ టీడీపీ స్పోక్స్ పెర్సన్ పిల్లి మాణిక్యరావు అన్నారు. మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టి.. ఉన్మాద ఆనందాన్ని పొందారని మండిపడ్డారు. వీటన్నింటికి త్వరలోనే మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డే అత్యంత ఆర్థిక నేరస్తుడని, చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, ఆయన ఆస్తులు కూడా అటాచ్‌మెంట్ అయ్యాయన్నారు. ఒక నేరస్తుడు పరిపాలనలోకి వస్తే.. వ్యవస్థలు ఏ విధంగా చిన్నాభిన్నమవుతాయన్నదానికి చంద్రబాబు కేసే ఉదాహరణ అని పిల్లి మాణిక్యరావు అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-21T09:41:06+05:30