Share News

AP Assembly: ఏపీ శాసన సభ నిరవధిక వాయిదా

ABN , Publish Date - Nov 22 , 2024 | 05:06 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సీహెచ్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఈ సందర్బంగా 10 రోజుల పాటు సభలో జరిగిన వివిధ అంశాలను ఆయన వివరించారు.

AP Assembly: ఏపీ శాసన సభ నిరవధిక వాయిదా
AP Assembly Speaker CH. Ayyanna Patrudu

అమరావతి, నవంబర్ 22: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. అంతకు ముందు ఆయన సభలో మాట్లాడుతూ.. ఈ సమావేశాలు మొత్తం 10 రోజులు జరిగాయన్నారు. ఇంకా వివరించాలంటే... 59 గంటల 55 నిముషాలు సమావేశం జరిగాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి.. ఆమోదించినట్లు వివరించారు. ఈ సభలో సభ్యులు అడిగిన 75 ప్రశ్నలకు.. మంత్రులు సమాధానం ఇచ్చారన్నారు.

Also Read: సీసీ టీవీలపై అసత్య ప్రచారం.. రంగంలోకి దిగిన భారతీయ రైల్వే


సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు..

అలాగే సీఎం చంద్రబాబు నాయుడితోపాటు మంత్రులు ఎనిమిది ప్రకటనలు చేశారని చెప్పారు. సభలో వివిధ అంశాలపై 120 మంది సభ్యులు ప్రసంగించారని పేర్కొన్నారు. ఈ సభలో రెండు లఘు చర్చలతో పాటు, మూడు ప్రభుత్వ తీర్మానాలను ఆమోదించారని గుర్తు చేశారు. ఇక ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగిందన్నారు. అదే విధంగా మూడు కమిటీలకు ఎన్నిక సైతం జరిగిందని పేర్కొన్నారు.

Also Read: స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ పెంచిన ప్రభుత్వం


పీఏసీ కమిటీ సభ్యులుగా..

ఈ సందర్భంగా వివిధ కమిటీలలో ఎన్నికైన సభ్యుల పేర్లను ఈ సందర్భంగా స్పీకర్ ప్రకటించారు. పీఏసీ కమిటీ విజేతలుగా.. నక్కా ఆనందబాబు, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, రామంజనేయులు, జయనాగేశ్వరరెడ్డి, కోళ్ల లలిత కుమారి, శ్రీరాంతాతయ్య, పులపర్తి రామాంజనేయులు, విష్ణుకుమార్ రాజు ఎంపికయ్యారు.


అంచనాల కమిటీకి..

అలాగే అంచనాల కమిటికీ భూమా అఖిల ప్రియ, బండారు సత్యానందం, వాల్మీకి పార్ధసారథి, ఏలూరి సాంబశివరావు, నిమ్మక జయకృష్ణ, కందుల నారాయణ రెడ్డి, సుధీర్ కుమార్లను... అలాగే ప్రభుత్వ రంగ సంస్ధల కమిటీ విజేతలుగా అయితాబత్తుల ఆనందరావు, ఈశ్వరరావు, సత్యనారాయణ, గౌతు శిరీష్, కూన రవికుమార్, వర్ల కుమార్ రాజా, తెనాలి శ్రవణ్‌ కుమార్, వసంత కృష్ణ ప్రసాద్, రంగారావు ఎంపికయ్యారు. అదే విధంగా విశాఖ డెయిరీ అక్రమాలపై ప్రత్యేక సభా సంఘం వేయాలని అసెంబ్లీ నిర్ణయించిందన్నారు.


కుటమికి పట్టం..

ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ఈ నవంబర్ మాసంతో ముగియినుంది.


అందుకే సభలో బడ్జెట్..

ఈ నేపథ్యంలో10 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ సమావేశాల్లో 2024 -25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తోపాటు ఆ పార్టీ సభ్యులు డుమ్మా కొట్టారు. తనకు ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ ఏపీ స్పీకర్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోరారు.


న్యాయస్థానానికి మాజీ సీఎం..

ఎమ్మెల్యేల సంఖ్య బలం లేకుండా.. ఆ హోదా కేటాయించ లేమంటూ వైసీపీ అధినేతకు స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానాన్ని వైఎస్ జగన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష హోదా కేటాయించని నేపథ్యంలో సభకు హాజరు కానని వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విధితమే. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 131, జనసేన పార్టీ 21, వైఎస్ఆర్‌సీపీ 11, బీజేపీ 8 మంది సభ్యులు విజయం సాధించారు.

For Andhra Pradesh News And Telugu News

Updated Date - Nov 22 , 2024 | 05:06 PM