MLA GV Anjaneyulu: పదవులు ఎందుకు.. రాజీనామా చేయండి
ABN , Publish Date - Nov 22 , 2024 | 08:57 PM
అసెంబ్లీకి డుమ్మా కొట్టిన వైసీపీ అధినేతతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నిప్పులు చెరిగారు
గుంటూరు, నవంబర్ 22: అసెంబ్లీకి రాని వాళ్లకు పదవులు ఎందుకు? తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. అసెంబ్లీకి హాజరుకానీ వాళ్లు పదవులు అడగడమే పెద్ద విడ్జూరంగా ఉందని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా వ్యవహరిస్తు్న్న తీరుపై శుక్రవారం గుంటూరులో ఆయన మండిపడ్డారు.
Also Read: సీఎంతో ముగిసిన భేటీ.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
Also Read: సీసీ టీవీలపై అసత్య ప్రచారం.. రంగంలోకి దిగిన భారతీయ రైల్వే
వైఎస్ జగన్ కి చట్ట సభలపై గౌరవ, మర్యాదలు లేకుండా పోయాయన్నారు. ఓటింగ్ బాయ్‌కాట్ చేసే వాళ్లు నామినేషన్‌లు ఎందుకు వేశారంటూ వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. ప్రజలు ఎప్పుడో వైసీపీని బాయ్‌కాట్ చేశారనే విషయాన్ని తెలుసుకోవాలని వైఎస్ జగన్‌కు ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సూచించారు. ఓటింగ్‌కు రాలేమన్న ప్రబుద్ధులు.. పీఏసీ సభ్యత్వాలకు ఎందుకు పోటీలో నిలిచారో చెప్పాలని డిమాండ్ చేశారు.
AP Assembly: పరిశ్రమ హోదాతో పర్యాటక రంగానికి ఊతం
Also Read: ఎండు కొబ్బరి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
గతంలో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా.. బాధ్యతగా వారు అసెంబ్లీకి హాజరై పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. సీఎం పదవి ఉంటేనే అసెంబ్లీకి వస్తానని వైఎస్ జగన్ చెప్పడం సిగ్గు చేటు అని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్.. తన ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో తాలిబాన్ పాలన సాగిందన్నారు.
Also Read: ఏపీ శాసన సభ నిరవధిక వాయిదా
Also Read: స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ పెంచిన ప్రభుత్వం
ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో అంత కంటే ఘోరమైన పరిస్థితులు చూశామని తెలిపారు. వికృత పోకడలు సాగిస్తే.. వైసీపీని శాశ్వత సమాధి చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఓటర్లు కట్టబెట్టారు. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అయితే తనకు ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ వైఎస్ జగన్.. స్పీకర్‌ను కోరారు. ఎమ్మెల్యేల సంఖ్య బలం లేకుండా.. ప్రతిపక్ష హోదా కేటాయించ లేమని వైసీపీ అధినేతకు స్పీకర్ స్పష్టం చేశారు.
ప్రతిపక్ష హోదా కేటాయించకుంటే.. సభకు హాజరు కానని ఇప్పటికే ఎమ్మెల్యే వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆ క్రమంలో వైసీపీ అధినేతతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావడం లేదు. దీంతో వైఎస్ జగన్.. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
For Andhra pradesh News And Telugu News