పేదరిక నిర్మూలనకు ఇందిరాగాంధీ ఎనలేని కృషి
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:28 AM
కాకినాడ సిటీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : దేశంలో పేదరిక నిర్మూలనకు ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారని, అన్ని వర్గాల ప్రజలు బా గుండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మం గపతి పళ్లంరాజు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి కార్యక్ర మాన్ని పీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లిపూడి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఇందిరాగాంధీ చిత్ర
కాకినాడ సిటీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : దేశంలో పేదరిక నిర్మూలనకు ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారని, అన్ని వర్గాల ప్రజలు బా గుండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మం గపతి పళ్లంరాజు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి కార్యక్ర మాన్ని పీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లిపూడి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఇందిరాగాంధీ చిత్రపటానికి నేతలు పూల మాల లు వేసి నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా పళ్లంరాజు మాట్లాడుతూ దేశ తొలి మహిళా ప్రధానిగా, ఉక్కు మహిళగా విశేష సేవలందిం చారన్నారు. ఇందిరమ్మ ఆశయాల సాధనకు ప్రతీ కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త కృషి చేయా లన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు పీసీసీ ఉపాధ్యక్షుడు మట్టా శివప్రసాద్, కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్కా నూకరాజు, ఐఎన్‌టీ యూసీ అధ్యక్షుడు తాళ్లూరి రాజు, జిల్లా నాయకులు తుమ్మల దొర బాబు, ముమ్మిడి సత్యనారాయణ, దవులూరి ధనకోటి, తాండ్రంకి రమణ మూర్తి, వనుం రమణ, పిల్లి చిన్న సత్యవతి, లలిత పాల్గొన్నారు.