Share News

Pawan Kalyan : మండలిలో స్పీచ్‌తో అదరగొట్టిన పవన్ కల్యాణ్

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:39 PM

త్వరలోనే డంపింగ్ యార్డ్‌ల ఏర్పాటు, నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో పంచాయతీ భవనాలు, ఇతర కార్యాలయలకు రంగులు వేయడానికి అయిన ఖర్చుపై పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. పంచాయతీల్లో సచివాలయ భవనాలకు రంగులు వేయడానికి రూ.101 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు.

Pawan Kalyan : మండలిలో స్పీచ్‌తో అదరగొట్టిన  పవన్ కల్యాణ్

అమరావతి: ఏపీ శాసనమండలిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తొలిసారిగా మాట్లాడారు. రాష్ట్రంలోని పంచాయితీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుపై మండలిలో చర్చ జరిగింది. ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమాధానంగా మాట్లాడుతూ... పంచాయితీల్లో డంపింగ్ యార్డ్‌ల నిర్వహణ అవసరాన్ని గుర్తించినట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్‌లో నిర్వహణ అందరి బాధ్యత అని తెలిపారు. స్కూల్స్ ఏర్పాటు చేయడానికే సెంటు భూమి లేని పంచాయితీలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే 10,15 పంచాయితీలు కలిపి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని అన్నారు.


త్వరలోనే డంపింగ్ యార్డ్‌ల ఏర్పాటు, నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో పంచాయతీ భవనాలు, ఇతర కార్యాలయలకు రంగులు వేయడానికి అయిన ఖర్చుపై పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. పంచాయతీల్లో సచివాలయ భవనాలకు రంగులు వేయడానికి రూ.101 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు. ఇందులో రంగులు వేయడానికి రూ.49 కోట్లు అయ్యాయని అన్నారు.వాటిని తొలగించి తిరిగి రంగులు వేయడానికి రూ.52 కోట్లకు పైగా ఖర్చు అయిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు.


పంచాయతీల ద్వారా మోటివేషన్

‘‘పంచాయతీల ద్వారా మోటివేషన్ తీసుకువస్తాం. 101 గ్రామ పంచాయతీల్లో చెత్తతో రూ.2600 కోట్లు ఆదాయం సమకూరింది. రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. స్వచ్చాంధ్ర ద్వారా దీనిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలంతా దీనిపై అవగాహన పెంచుకోవాలి. చెత్త ద్వారా వచ్చే సంపదను ఆయా కార్మికులకు కేటాయిస్తాం. బ్లీచింగ్ పౌడర్‌కే పంచాయతీల్లో డబ్బులు లేని పరిస్థితి. పంచాయతీకి నిధులు సమకూర్చే సవాల్‌ను స్వీకరించి ముందుకు సాగుతాం. గ్రామాల్లో రోడ్డు వెంట కొబ్బరి చెట్లు పెంచడం ద్వారా కొంత ఆదాయం సమకూర్చుకుంటాం. పంచాయతీలను అనేక కారణాలతో నిర్వీర్యం చేశారు. సమూలంగా ప్రక్షాళన జరగాలి. స్వయం సమృద్ధిగా పంచాయతీలు ఎదగాలి. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా అన్ని పరిష్కారాలు ఒకేసారి అయిపోవు. ఈ ప్రాజెక్టును ముందు అమలు చేసి.. ఫలితాల చూసి.. అన్ని‌చోట్ల అమలు చేస్తాం. దీనికి కమ్మిట్మెంట్ ఉండే లీడర్ షిప్ ఉంటేనే ఇది సాధ్యం. పిఠాపురం లో 54 పంచాయతీ ల్లో మేము చేసేది చేయగా.. ఎన్ఆర్ఐలు ముందుకు వస్తే వారి సాయం తీసుకుంటాం’’ అని పవన్ పేర్కొన్నారు.


ఆయన ఇప్పుడు సర్వీసులో లేరు..

‘‘సర్వీస్ అంటే ఎవరూ రారు.. చెత్తతో సంపద వస్తుంది అంటేనే ముందుకు వస్తారు. అన్ని అనర్ధాలకు ఒకే ఐఏయస్ కారణం. ఏ సమీక్ష చేసినా... ఆయనే మూల కారణం అంటున్నారు. ఆయన ఇప్పుడు సర్వీసులో లేరు. ఎవరిని బాధ్యులను‌ చేయాలి, నిధులు ఎలా రికవరీ చేయాలి? కేవలం కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం పంచాయతీలకు రాష్ట్ర వాటా ఇవ్వలేదు. కేంద్రం కూడా నమ్మకం పోయి నిధులు ఆపేసింది. 70+30 నిధులు ఇస్తే పని అయ్యేది.. అది జరగలేదు. రకరకాల పేర్లు చెప్పి నిధులు మొత్తం మళ్లించారు. ముందు ఖర్చు పెట్టండి, తరువాత బిల్లు ఇస్తాం అని నమ్మబలికారు. డబ్బులు వచ్చినా.. రోడ్లు వేసిన కాంట్రాక్టర్‌లకు గత ప్రభుత్వం ఇవ్వలేదు. అన్ని వ్యవస్థ ల్లో, పథకాల్లో ఇటువంటి ఛాలెంజ్‌లు ఉన్నాయి. వీటిని పెట్టుకుని వెంటనే అన్నీ‌ చేయాలంటే మాకు సాధ్యం కాదు కదా’’ అని పవన్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఓ మై గాడ్.. బీచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ..

పవన్ కల్యాణ్‌కు ఊరట

Real Latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2024 | 02:30 PM