మేం కంపెనీలు తెస్తే.. జగన్ తరిమేశారు
ABN , Publish Date - Nov 22 , 2024 | 04:38 AM
రాష్ట్ర విభజన అనంతరం 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కష్టపడి పారిశ్రామిక, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ కంపెనీలను తీసుకొచ్చిందని... కానీ, జగన్ వచ్చాక ఆ కంపెనీలు రాష్ట్రం వదిలిపోయేలా చేశారని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
అసెంబ్లీలో మంత్రి లోకేశ్ ప్రకటన
అమరావతి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన అనంతరం 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కష్టపడి పారిశ్రామిక, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ కంపెనీలను తీసుకొచ్చిందని... కానీ, జగన్ వచ్చాక ఆ కంపెనీలు రాష్ట్రం వదిలిపోయేలా చేశారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో 27 కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలివెళ్లాయని చెప్పారు. శాసనసభలో గురువారం జీరో అవర్ తర్వాత మంత్రి లోకేశ్ ఎలకా్ట్రనిక్స్, డేటా పాలసీలపై ప్రకటన చేశారు. ఎంతో కష్టపడి తాము టీసీఎల్ను రాష్ట్రానికి తీసుకురాగా, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే.. టీసీఎల్లో పనిచేసే ఓ అధికారిని భోజనానికి పిలిచి నిర్బంధించారన్నారు. ఎలకా్ట్రనిక్ తయారీ యూనిట్లు, డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తే పెట్టుబడి రాయితీ, తక్కువ ధరకే వసతులు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ఉత్పత్తి రంగంలో ఏపీని నం.1 స్థానంలో నిలబెడతామని చెప్పారు.