దళితుల సమగ్రాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jun 10 , 2024 | 12:23 AM
దళితుల సమగ్రాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు అన్నారు.
బుచ్చెయ్యపేట, జూన్ 9: దళితుల సమగ్రాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో ఆదివారం వడ్డాదిలో ఆయనను పలు దళిత సంఘాల నాయకులు కలిసి పూలమాలలు, శాలువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ యువజన విభాగం అధ్యక్షుడు బూసి కోటి, ప్రతినిధులు మరువాడ ఈశ్వరరావు, వంకర రాజుబాబు, గాదిరాయి ఎంపీటీసీ సభ్యుడు భీమేష్లు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో దళితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాపోయారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులు అభ్యున్నతి సాధించగా, వైసీపీ పాలనలో అన్నివిధాలా దెబ్బతిన్నామన్నారు. ఇకపై దళితుల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై తాతయ్యబాబు మాట్లాడుతూ దళిత బాంధవుడు చంద్రబాబునాయుడు అని, మ్యానిఫెస్టో మేరకు దళితుల సంక్షేమానికి ఆయన పాటుపడతారని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘాల ప్రతినిధులు త్రివేణి, మోహన్, గుమ్మాలమ్మతల్లి, లోవరాజు, సాగర్, శ్రీను, బి.రామారావు, చోడవరం ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజబాబు, నడుపూరు దేవుడు, జె.రాజు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.