Share News

Next Week IPOs: వచ్చే వారం రానున్న కొత్త ఐపీఓలు.. ఈసారి ఎన్ని ఉన్నాయంటే..

ABN , Publish Date - Nov 17 , 2024 | 01:12 PM

స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వారం రానే వచ్చేసింది. నవంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే వారంలో 3 కొత్త IPOలు రాబోతున్నాయి. ఆ కంపెనీల వివరాలేంటి, ఎప్పటి నుంచి వస్తున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Next Week IPOs: వచ్చే వారం రానున్న కొత్త ఐపీఓలు.. ఈసారి ఎన్ని ఉన్నాయంటే..
upcoming ipos on november 18th

దేశీయ స్టాక్ మార్కెట్లో (stock market) మళ్లీ ఐపీఓల వీక్ రానే వచ్చింది. ఈసారి నవంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే వారంలో కేవలం 3 కొత్త IPOలు మాత్రమే రాబోతున్నాయి. వీటిలో ఒకటి మాత్రమే మెయిన్‌బోర్డ్ సెగ్మెంట్ నుంచి వస్తుంది. ఇది కాకుండా కొత్త వారంలో ఇప్పటికే ప్రారంభించిన రెండు IPOలలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. మూడు కంపెనీలు వచ్చే వారం స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ కంపెనీల వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.


నవంబర్ 18 నుంచి రానున్న కొత్త ఐపీఓలు

NTPC గ్రీన్ ఎనర్జీ ఐపీఓ: ఈ ఇష్యూ నవంబర్ 19న మొదలవుతుంది. రూ. 10,000 కోట్ల పరిమాణంలో వస్తున్న ఈ ఐపీఓ కోసం ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.102-108గా నిర్ణయించారు. లాట్ పరిమాణం 138 షేర్లు. నవంబర్ 22న ఐపీఓ ముగింపు ఉంటుంది. నవంబర్ 27న BSE, NSEలలో షేర్ల లిస్టింగ్ జరుగుతుంది.

Lamosaic India IPO: రూ. 61.20 కోట్లతో వస్తున్న ఈ ఇష్యూ నవంబర్ 21న ప్రారంభమై, నవంబర్ 26న ముగుస్తుంది. బిడ్డింగ్ ధర ఒక్కో షేరుకు రూ. 200. లాట్ పరిమాణం 600 షేర్లు. నవంబర్ 29న NSE SMEలో షేర్లు లిస్ట్ చేయబడతాయి.


C2C అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఐపీఓ: ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.99.07 కోట్లు సమీకరించాలనుకుంటోంది. ఇది నవంబర్ 22న ప్రారంభమై, నవంబర్ 26న ముగుస్తుంది. ఒక్కో షేరు ధర రూ. 214-226. లాట్ పరిమాణం 600 షేర్లు. నవంబర్ 29న NSE SMEలో షేర్లు లిస్ట్ చేయబడతాయి.

ఇప్పటికే ప్రారంభమైన ఐపీఓలు

Onyx Biotec IPO: ఇప్పటికే మొదలైన ఈ ఐపీఓ రూ. 29.34 కోట్ల ఈ ఇష్యూ నవంబర్ 18న ముగుస్తుంది. షేర్లు నవంబర్ 21న NSE SMEలో లిస్ట్ కావచ్చు. బిడ్డింగ్ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 58-61. లాట్ పరిమాణం 2000 షేర్లు.


జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్ IPO: ఈ ఇష్యూ కూడా నవంబర్ 18న ముగుస్తుంది. రూ. 1,114.72 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 259-273. లాట్ పరిమాణం 54 షేర్లు. IPO ముగిసిన తర్వాత షేర్లు నవంబర్ 21న BSE, NSEలో జాబితా చేయబడతాయి.

లిస్ట్ కానున్న కంపెనీలు

నవంబర్ 18న కొత్త వారంలో నీలం లినెన్స్, గార్మెంట్స్ షేర్లు NSE SMEలో జాబితా చేయబడతాయి. మంగళ్ కంప్యూజన్ నవంబర్ 20న BSE SMEలో జాబితా చేయబడుతుంది. Onyx Biotec షేర్లు నవంబర్ 21న NSE SMEలో ప్రారంభమవుతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఆధారంగా ఆంధ్రజ్యోతి పెట్టుబడి చేయాలని సూచించదు. కేవలం సమాచారం మాత్రమే అందిస్తుంది. మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం అనేది మార్కెట్ లాభనష్టాలకు లోబడి ఉంటుంది. పెట్టుబడి చేసే ముందు నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం మంచిది.


ఇవి కూడా చదవండి:

Jiostar: మొదలైన జియోస్టార్.. రూ. 15కే డబుల్ డోస్ ఎంటర్ టైన్‌మెంట్


Viral News: లష్కరే తోయిబా అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫోన్.. తర్వాత ఏమైందంటే..

Air Pollution: రాజధానిలో దారుణం.. ఐదో రోజు అదే వాయు కాలుష్యం, బతికేదేలా..


Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..

Read More International News and Latest Telugu News

Updated Date - Nov 17 , 2024 | 01:15 PM