Share News

హెల్త్‌ సప్లిమెంట్లను ఔషధాలుగా పరిగణించాలి!

ABN , Publish Date - Nov 17 , 2024 | 03:55 AM

ఆరోగ్య సమస్యలను, వ్యాధులను నయం చేస్తాయంటూ పలు కంపెనీలు విక్రయిస్తున్న హెల్త్‌ సప్లిమెంట్లను ఔషధాల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఓ అంతర్‌ మంత్రిత్వశాఖల కమిటీ సిఫార్సు చేసింది.

హెల్త్‌ సప్లిమెంట్లను ఔషధాలుగా పరిగణించాలి!

న్యూఢిల్లీ, నవంబరు 16: ఆరోగ్య సమస్యలను, వ్యాధులను నయం చేస్తాయంటూ పలు కంపెనీలు విక్రయిస్తున్న హెల్త్‌ సప్లిమెంట్లను ఔషధాల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఓ అంతర్‌ మంత్రిత్వశాఖల కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖకు తన నివేదికను సమర్పించింది. ఈ సిఫార్సు సర్కారు ఆమోదం పొందితే హెల్త్‌ సప్లిమెంట్లు.. ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీఓ) పరిధిలోకి వస్తాయి. తద్వారా వాటి నాణ్యతా ప్రమాణాలను ఔషధాల స్థాయిలో పరీక్షించటం జరుగుతుంది. అలాగే, ఔషధాల ధరలను నిర్ణయించే ‘జాతీయ ఔషధ ధరల సాధికార సంస్థ’ (ఎన్‌పీపీఏ) వాటి ధరలను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న హెల్త్‌ సప్లిమెంట్లు.. ‘సురక్షిత ఆహార, ప్రమాణాల సాధికార సంస్థ’ (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) పరిధిలో ఉన్నాయి.

Updated Date - Nov 17 , 2024 | 03:55 AM