ఆధారాలు చూపండి.. లేదా క్షమాపణ చెప్పండి
ABN , Publish Date - Sep 24 , 2024 | 03:46 AM
బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం విపత్తు సహాయ నిధులను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అక్రమంగా అప్పగించిందని కంగన ఆరోపించారు. ఈ ఆరోపణలను వారం రోజుల్లో నిరూపించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని హిమాచల్‌ప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. రైతులపై ఆమె చేసిన వ్యాఖ్యలకు సొంత పార్టీనే మందలించిందని, కంగన తెలివి తక్కువతనానికి అదో నిదర్శనం అన్నారు.