Kurumurthy Jatara : పేదల తిరుపతి కురుమూర్తి జాతరకు వేళాయే

ABN, Publish Date - Nov 09 , 2024 | 08:04 AM

మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండ లంలోని అమ్మాపూర్‌ గ్రామ సమీపంలో కురు మూర్తి వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Kurumurthy Jatara : పేదల తిరుపతి కురుమూర్తి జాతరకు వేళాయే 1/11

కురుమూర్తి జాతరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే ప్రధానమైనది. సమ్మక్క.. సారలమ్మ జాతర తర్వాత అంతటి భక్తుల రద్దీ కలిగిన జాతరగా దీనికి పేరుంది. ఈ జాతర కోసం రాష్ట్రంలోని ప్రజలు భారీగా ఇక్కడికి తర లివచ్చి వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు.

Kurumurthy Jatara : పేదల తిరుపతి కురుమూర్తి జాతరకు వేళాయే 2/11

నెల రోజులపాటు జరగనున్న కురుమూర్తి జాతరలో వ్యాపారాలు చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. అయితే గత నెల 31నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావటంతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.

Kurumurthy Jatara : పేదల తిరుపతి కురుమూర్తి జాతరకు వేళాయే 3/11

జాతర మైదానంలో గాజులు, మిఠాయి, చిన్నపిల్లల ఆటవస్తువులు, లేడీస్‌ కార్నర్‌లు, ఇనుపసామాన్లు, కుంకుమ దుకాణాలు, ఎద్దులకు వేసే వస్తువులు, జ్యూస్‌ సెంటర్లు, రంగుల రాట్నాలు, వివిధ రకాల జంతు ప్రదర్శనలు, ఐస్‌క్రీం సెంటర్లు, ఓపెన్‌ థియేటర్‌ వంటి వాటి కోసం వ్యాపారులు జోరుగా దుకాణాలను, గుడారాలను ఏర్పాటు చేశారు.

Kurumurthy Jatara : పేదల తిరుపతి కురుమూర్తి జాతరకు వేళాయే 4/11

శ్రీ కురుమూర్తి శ్రీనివాస స్వామి ఆలయం, తెలంగాణలోని పురాతన దేవాలయాలలో ఒకటిగా పరిగణించ బడుతుంది, ఇది విష్ణువు భక్తులకు ప్రధాన ఆకర్షణ. ఇక్కడ స్వామివారిని లార్డ్ వేంకటేశ్వర అని పిలుస్తారు. ఈ ఆలయం ఆధ్యాత్మిక చరిత్రకు మరియు ఇక్కడ అనుసరిస్తున్న సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది.

Kurumurthy Jatara : పేదల తిరుపతి కురుమూర్తి జాతరకు వేళాయే 5/11

శ్రీ ముక్కర చంద్రారెడ్డి కొండల్లో ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించే వరకు దాదాపు 630 ఏళ్లుగా స్వామివారి విగ్రహం గుహల్లో ఉంది. ఈ ఆలయాన్ని శ్రీరామభూపాలుడు.కొత్తకాపులు పునర్నిర్మించినట్లు తెలుస్తోంది.

Kurumurthy Jatara : పేదల తిరుపతి కురుమూర్తి జాతరకు వేళాయే 6/11

ఈ ఆలయాన్ని అద్భుతమైన నిర్మాణ శైలిలో నిర్మించారు. ప్రవేశ ద్వారం పెద్ద గోపురం ఉంది. ప్రధాన ఆలయానికి 200 మెట్లు ఉన్నాయి, అయితే యాత్రికులు వారి వాహనాల ద్వారా కూడా వెళ్లొచ్చు.

Kurumurthy Jatara : పేదల తిరుపతి కురుమూర్తి జాతరకు వేళాయే 7/11

1968లో కురుమూర్తి ఆలయం దేవాదాయ శాఖలో విలీనమైంది. ఫలితంగా 1976 నుంచి ఆభరణాలను ఆత్మకూరు బ్యాంకులోని ప్రత్యేక లాకర్‌లో భద్రపరుస్తున్నారు . ఉత్సవాల సందర్భంగా నేటికి ముక్కెర వంశస్థులే ఆభరణాల అలంకరణోత్సవంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

Kurumurthy Jatara : పేదల తిరుపతి కురుమూర్తి జాతరకు వేళాయే 8/11

కోనేరు లో స్నానమాచరించి ఉద్దాలను, స్వామి వారిని, దర్శించుకుని పూజలు చేశారు. దాసంగాలు సమ ర్పించి మొక్కులు చెల్లించారు.

Kurumurthy Jatara : పేదల తిరుపతి కురుమూర్తి జాతరకు వేళాయే 9/11

వివిధ రకాలు దుకా ణాల ఏర్పాటు, ప్రముఖుల రాక, ప్రత్యేక పూజలు, భక్తుల రద్దీతో ఇక్కడి ప్రాంగణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.

Kurumurthy Jatara : పేదల తిరుపతి కురుమూర్తి జాతరకు వేళాయే 10/11

కురుమూర్తి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు.. గురువారం (నవంబర్ 07న) రూ. 110 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Kurumurthy Jatara : పేదల తిరుపతి కురుమూర్తి జాతరకు వేళాయే 11/11

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల ఊరేగింపు ఉత్సవమే ప్రధాన ఘట్టం. ఉద్దాల ఊరేగింపులో భాగంగా మొదట పల్లమర్రి నుంచి చాటను ఊరేగింపుగా తీసుకొస్తారు.

Updated at - Nov 10 , 2024 | 07:22 AM