Rohit Sharma: డేంజర్‌లో రోహిత్ శర్మ.. అతడ్ని అడ్డుగా పెట్టుకొని బీసీసీఐ గేమ్స్
ABN , Publish Date - Nov 18 , 2024 | 09:30 PM
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. అతడ్ని డేంజర్‌లోకి నెట్టడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
IND vs AUS: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు. అటు బ్యాటర్‌గా, ఇటు సారథిగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్-2023 ట్రోఫీ మిస్సయినా.. టీ20 ప్రపంచ కప్-2024 కప్పును దేశానికి అందించాడు హిట్‌మ్యాన్. ఇదే ఊపులో వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ మెన్ ఇన్ బ్లూను విజేతగా నిలబెట్టాలని చూస్తున్నాడు. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోనూ జట్టును విన్నర్‌గా నిలపాలని భావిస్తున్నాడు. అయితే భారత క్రికెట్ బోర్డు ప్లాన్స్ మాత్రం వేరేలా ఉన్నాయని తెలుస్తోంది. ఓ స్టార్ ప్లేయర్‌ను అడ్డు పెట్టుకొని రోహిత్‌తో బోర్డు గేమ్స్ ఆడుతోందని సమాచారం. హిట్‌మ్యాన్ కెరీర్ డేంజర్‌లో ఉందని వినిపిస్తోంది. అసలేం జరుగుతోందనేది ఇప్పుడు చూద్దాం..
అతడే సరైనోడు
టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్‌ను తప్పించాలని బీసీసీఐ భావిస్తోందట. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీనే అతడికి కెప్టెన్‌గా చివరి సిరీస్ అని తెలుస్తోంది. ఆ టోర్నీలో గనుక ఫెయిలైతే హిట్‌మ్యాన్ నుంచి సారథ్య బాధ్యతల్ని వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రాకు బదిలీ చేయాలని డిసైడ్ అయిందట. అందుకే విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లు జట్టులో ఉన్నా పెర్త్ టెస్ట్‌లో టీమ్‌ను నడిపించే బాధ్యతల్ని బుమ్రాకు అప్పగించారట బోర్డు పెద్దలు. అవసరమైన సమయంలో దూకుడు, సిచ్యువేషన్‌ను బట్టి కామ్‌గా, కూల్‌గా కూడా ఉండగలిగే బుమ్రానే కెప్టెన్సీకి సరైనోడని అనుకుంటున్నారట. ఒకవేళ పెర్త్ టెస్ట్‌లో గనుక భారత్ గెలిస్తే.. తర్వాతి మ్యాచులకు రోహిత్ అందుబాటులోకి వచ్చినా బుమ్రానే సారథిగా కంటిన్యూ చేసే ప్లానింగ్స్ కూడా చేస్తోందట బోర్డు.
అదే మైనస్
కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఇతర ఫార్మాట్లలో రోహిత్ సూపర్ సక్సెస్ అయినా.. టెస్టుల్లో మాత్రం ఆ రేంజ్‌లో ప్రభావం చూపకపోవడం అతడికి మైనస్‌గా మారిందని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో అతడు ఫెయిల్ అవడం నెగెటివ్‌గా చూస్తున్నారట. అలాగే సారథిగా లాంగ్ ఫార్మాట్‌లో అతడు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా బిగ్ మైనస్‌గా మారాయని సమాచారం. న్యూజిలాండ్ సిరీస్‌లో రోహిత్ తీసుకున్న పలు నిర్ణయాలు బెడిసికొట్టడంతో బుమ్రా వైపు బోర్డు పెద్దలు ఫోకస్ చేస్తున్నారని వినిపిస్తోంది. అందుకే అతడ్ని అడ్డుగా పెట్టుకొని రోహిత్ ఆటకట్టించాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి.
కోహ్లీకి జరిగినట్లే..!
ఇప్పటికే రోహిత్ టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకూ రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. అయితే లాంగ్ ఫార్మాట్‌లో మాత్రం మరిన్ని రోజులు కొనసాగాలని అనుకుంటున్నాడట. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అతడు టీమ్‌లో ఉండగానే మరో కెప్టెన్‌ను తయారు చేయడం అవసరమనే ఉద్దేశంతో బుమ్రా వైపు చూస్తున్నారట బోర్డు పెద్దలు. అయితే అప్పట్లో విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు హిట్‌మ్యాన్ విషయంలోనూ అలాగే చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెర్త్ టెస్ట్‌తో పాటు బీజీటీ రిజల్ట్‌తో రోహిత్ టెస్ట్ ఫ్యూచర్ మీద ఓ క్లారిటీ రావడం ఖాయమని తెలుస్తోంది.
Also Read:
ఆ భారత స్టారే నా గురువు.. అతడి వల్లే ఈ స్థాయిలో ఉన్నా: లియాన్
ఈ స్టార్ క్రికెటర్‌ను గుర్తుపట్టారా.. బరిలోకి దిగితే బౌలర్లకు బడితపూజే
స్టొయినిస్ మెరుపు ఇన్నింగ్స్.. పాక్ బౌలర్లకు నరకం చూపించాడు
For More Sports And Telugu News