Share News

Bandi Sanjay: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు: తెలంగాణ కాంగ్రెస్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Nov 23 , 2024 | 11:52 AM

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి పట్టిన గతే తెలంగాణ కాంగ్రెస్‌కు పడుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు.. తెలంగాణలో ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఇంకొకరికి ఇవ్వరని... వాళ్లలో వాళ్లే ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

Bandi Sanjay: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు: తెలంగాణ కాంగ్రెస్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

కరీంనగర్: తెలంగాణ నుంచి మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ డబ్బులు పంపిందని కేంద్ర మంత్రి, బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి కారణం.. తెలంగాణ, కర్ణాటకలో పాలనేనని విమర్శించారు. మహారాష్ట్రలో బీజేపీ చరిత్ర సృష్టించిందని బండి సంజయ్ అన్నారు. ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. మహారాష్ట్రలో మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసిందని తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహా సత్య దేవాలయం ఆవరణలో ఇవాళ(శనివారం) కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు బీజేపీ సాధించిందని అన్నారు. కాంగ్రెస్ సీఎంలు అంతా కలిసి ప్రచారం చేసినా ఆ పార్టీని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేసిన చోట కూడా కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని మహా ప్రజలు నమ్మలేదని. తెలంగాణ కాంగ్రెస్‌కు ఇదే గతి పడుతుందని బండి సంజయ్ విమర్శించారు.


కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని అన్నారు. మహారాష్ట్రలో విజయ డంక మోగించామని ఉద్ఘాటించారు. మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. సిద్ధాంతానికి వ్యతిరేకంగా శివసేన వెళ్లిందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌కు ఇదే గతి పడుతుందని చెప్పారు.తెలంగాణలో ఇచ్చిన ఒక్క హామీ కూడా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఇంకొకరికి ఇవ్వరని... వాళ్లలో వాళ్లే ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని ఎద్దేవా చేశారు. తాము కూల్చాలని అనుకోవడం లేదని చెప్పారు. మహా ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో లకలుకలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 12:26 PM