దేశీయ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్ ప్రస్థానం సమాప్తమైంది

విమానయాన సంస్థకు చెందిన ఆస్తులను విక్రయించడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది

దివాలా పరిష్కార ప్రయత్నాలు విఫలమవ్వడంతో.. రుణదాతలు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో

పెట్టుకుని సీజేఐ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది

ఆర్థిక కష్టాలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ 2019లోనే కార్యకలాపాలు నిలిపివేసింది

యాజమాన్య హక్కుల బదిలీ విషయంలో ఎస్‌బీఐ, ఇతర రుణదాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు

ఉద్యోగుల జీత భత్యాలు, నిధులు వెచ్చించడంలో విఫలమైనందున

సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ద్వారా లిక్విడేషన్‌ చెయ్యాలని తీర్పును వెలువరించింది

దీంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆస్తులను నగదుగా మార్చనున్నారు

రుణదాతలు, ఉద్యోగులు, ఇతర భాగస్వామ్య పక్షాల ప్రయోజనార్థం ఈ ఆదేశాలు జారీ చేసింది