వెల్లుల్లి దివ్యౌషదం కంటే తక్కువేమీ కాదు..

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ కొలెస్ట్రాల్ ను  అధికరక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యం కాపాడుతుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటలను, అసౌకర్యాలను తగ్గిస్తాయి.

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి నుండి శరీర కణాలను కాపాడతాయి.

కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

వెల్లుల్లిలో ఉండే రసాయనాలు శరీరాన్ని శుద్ది చేస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఆరోగ్యప్రయోజనాలను పక్కన పెడితే వెల్లుల్లి వంటకు మంచి రుచిని అందిస్తుంది.