బాదం బంక ఎప్పుడైనా తిన్నారా? వేసవిలో దీన్ని తింటే ఎన్ని లాభాలంటే..!

బాదం బంక లేదా బాదం గమ్ శరీరానికి చలువ చేసే గుణాలు కలిగి ఉంటుంది.  వేసవి కాలంలో దీన్ని తీసుకుంటే చాలా ప్రయోజనాలుంటాయి.

వేసవి కాలంలో ఎదురయ్యే జీర్ణసమస్యలను, జీర్ణాశయ అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

బాదం బంకలో కాల్షియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి  ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్డ్ గా ఉంచుతాయి.

బాదం బంకలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీల్ ను ఎక్కువసేపు ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

బాదం బంకలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

బాదం బంకలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు మెండుగా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.

కాల్షియం, ఫాస్పరస్ బాదం బంకలో పుష్కంలగా ఉంటాయి. ఇవి ఎముకతల ఆరోగ్యానికి సహాయపడతాయి.

సాంప్రదాయ వైద్యంలో బాదం బంకను సంతానోత్పత్తి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.