ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తినాల్సిందే!

ఆరెంజ్: ఇందులోని విటమిన్ సీ ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యం పెంచుతుంది.

దానిమ్మపండ్లు: ఇందులోని యాంటీఆక్సిడెంట్స్.. ఊపిరితిత్తుల్లో కణితులను నివారిస్తాయి.

ఉల్లిపాయలు: వీటిల్లో ఉండే ఆవిర్లు.. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి.

ఆపిల్స్: ఇందులోని ఫ్లేవనాయిడ్స్, విటమిన్లు.. ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉంచుతాయి.

ద్రాక్షపండు: ఇందులోని ఫ్లేవనాయిడ్.. ఊపిరితిత్తుల్లో కణితి పెరుగులను బంధిస్తుంది.

టమోటా: వీటిల్లోని లైకోపీన్, యాంటీఆక్సిడెంట్స్ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

బ్లూబెర్రీస్: వీటిల్లోని యాంటీఆక్సిడెంట్స్, ఆంథోసైనిన్‌.. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.

బీట్‌రూట్: ఇందులోని నైట్రేట్.. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.