కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటంటే.. 

ఉప్పును మితంగా తీసుకోవాలి. దీన్ని ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలపై ఒత్తిడి కలిగిస్తుంది. 

పొటాషియం అధికంగా ఉండే అరటి, నారింజ, బంగాళాదుంపలను మితంగా తీసుకోవాలి. 

పాస్పరస్ అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. 

ప్రాసెస్ చేసిన మాంసాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలి. 

షుగర్ ఎక్కువగా తీసుకుంటే తయాబెటిస్ ఎక్కువ అవుతుంది. తద్వారా కిడ్నీల వ్యాధులు తలెత్తుతాయి. 

కెఫిన్, ఆల్కాహాల్ ఉత్పత్తులు తీసుకోవడం కూడా చాలా వరకూ తగ్గించాలి. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.