సీమ వంకాయలో ఉండే పోషకాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తరచుగా తినడం వల్ల దీనిలోని మంచి గుణాలు మూత్రపిండాలు, మూత్రనాళాలను శుభ్రం చేసేందుకు తోడ్పడతాయి
శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికీ ఇది ఉపశమనం కలిగిస్తుంది.
దీనిలోని పొటాషియం, పీచు పదార్థాలు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
పీచు పదార్థం రక్తంలోని చెడు కొలెస్ట్రాల్, మలినాలను తొలగిస్తుంది.
గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఇది దోహదపడుతుంది. శిశువు మస్తిష్కం, నరాల వృద్ధికి ఫోలేట్ అనేది ముఖ్యమైన పోషకం. కాబట్టి దీన్ని వారికి తరచూ ఆహారంగా అందిస్తే మంచి శిశువు జన్మిస్తారు.
సీమ వంకాయను తినే వారిలో చర్మ, జుట్టు సమస్యలు తగ్గుతాయి
చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. చర్మ కణాల పునరుత్పత్తికి చాయోట్ దోహదపడుతుంది.