వయసును బట్టి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. 30 ఏళ్ల లోపు వారు తీసుకోవాల్సిన 6 ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫైబర్ అధికంగా ఉండే వోట్స్, గోధుమలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. 

30 ఏళ్ల వయసులో ఎముకల ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. దీంతో కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. 

జింక్ అధికంగా లభించే చేపలు, బీన్స్, గింజలు తదితర ఆహార పదార్థాలను తీసుకోవాలి. 

సీజనల్‌గా లభించే పండ్లు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. 

పొటాషియం ఎక్కువగా లభించే పండ్లు, చేపలు, చిక్కుళ్లను ఆహారంలో చేర్చుకోవాలి.

ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

ఇవన్నీ మీకు అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.