నేలపై సంచరించే జీవాలన్నిటికంటే పెద్దవి ఏనుగులు. కానీ, ఒక్కోసారి ఏనుగులే ఇతర జంతువులకు ఆహారమవుతాయి.

గున్న ఏనుగులు, ముసలి ఏనుగులను సింహాలు సులభంగా చంపేస్తాయి.

తటాకాలు, కొలనుల వద్ద నీరు తాగడానికి వచ్చే గున్న ఏనుగులు ఒక్కోసారి మొసళ్లకు ఆహారమైపోతాయి.

పులులు కూడా ఏనుగులపై దాడి చేసేందుకు ట్రై చేస్తాయి. కానీ, ఇలాంటి సందర్భాలు అరుదు.

బలహీనమైన వాటిని వేటాడే హైనాలు అవకాశం చిక్కితే చిన్న ఏనుగులను వదిలిపెట్టవు

అడవి కుక్కలదీ ఇదే దారి! గున్న ఏనుగులు, అనారోగ్యం, ముసలితనంతో బాధపడుతున్న వాటిని ఇవి టార్గెట్ చేస్తాయి.

చాలా అరుదుగా చీతాలు గున్న ఏనుగులను వేటాడతాయి.

ఏనుగు, హిప్పోపోటామస్ అప్పుడప్పుడూ తలపడతాయి! ఈ గొడవల్లో ఏనుగులు తీవ్ర గాయాలపాలైతే చనిపోతాయి.

అయితే, ఏనుగును ఇతర జంతువులు వేటాడం చాలా అరుదు.

భారీ శరీరం, గుంపుగా నివసించడం వంటి కారణాలతో ఏనుగులకు ముప్పు తక్కువ!