చలికాలంలో బద్ధకాన్ని తగ్గించుకోవడానికి 5 టిప్స్

విటమిన్ డి లోపంతో బద్ధకంగా అనిపిస్తుంది. ఉదయపు సూర్యుడి వెలుగులో కాసేపు ఉంటే విటమిన్ డి పుష్కలంగా అందుతుంది

వ్యాయామం చేయడం వల్ల శరీర కండరాలు యాక్టివ్ అవుతాయి. తద్వారా రక్త సరఫరా బాగా జరిగి.. బద్ధకాన్ని దూరం చేసుకోవచ్చు

కూరగాయలు, పండ్లువంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే బాడీలో శక్తి పెరిగి అలసట తగ్గుతుంది.

చలికాలంలో జీర్ణవ్యవస్థ పని తీరు నెమ్మదిగా ఉంటుంది. ఎక్కువగా తింటే త్వరగా జీర్ణంకాక బద్ధకం ఆవరిస్తుంది.

చలికాలంలో క్రమం తప్పకుండా గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. తద్వారా శరీర కండరాలు ఉత్తేజితమై రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు