తమ దేశం మీదుగా లేదా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రభుత్వం ఇచ్చే అనుమతే వీసా.

ప్రయాణానికి ముందే వీసా తీసుకోవాలి. వీసా సాధారణంగా పాస్‌పోర్టుపై స్టాంప్ లేదా స్టిక్కర్ రూపంలో ఉంటుంది.

పరాయి దేశంలో పనిచేసేందుకు ఇచ్చే అనుమతులను వర్క్ వీసా లేదా వర్క్ పర్మిట్ అంటారు.

రెండింటి మధ్య కొన్ని మౌలిక తేడాలు ఉన్నాయి. అవేంటంటే..

పరాయి దేశంలో ఏదైనా రంగంలో నిర్దిష్ట కాలంపాటు పనిచేసేందుకు ఇచ్చే అనుమతిని వర్క్ వీసా అంటారు

చాలా సందర్భాల్లో విదేశీ ఉద్యోగుల తరపున సంస్థలే వర్క్ వీసాకు దరఖాస్తు చేస్తాయి.

సాధారణంగా వర్క్ వీసా కాల వ్యవధి ఏడాది. కాలపరిమితి ముగిశాక మళ్లీ రెన్యూ చేసుకోవాలి.

దేశంలో అప్పటికే ఉన్న విదేశస్తులకు పని చేసుకునేందుకు ఇచ్చే అనుమతిని వర్క్ పర్మిట్ అంటారు.

వర్క్ వీసాతో పోలిస్తే వర్క్ పర్మిట్‌పై పరిమితులు తక్కువగా ఉంటాయి.

వర్క్ పర్మిట్ ఉన్నంత మాత్రాన పరాయి దేశానికి వెళ్లేందుకు అనుమతి ఉన్నట్టు భావించకూడదు.

వర్క్ వీసాల లాగే వర్క్ పర్మిట్‌ల గరిష్ఠ కాలవ్యవధి ఏడాది.