రవ్వ బొబ్బట్లను ఇలా చేస్తే..  ఒక్కటి కూడా మిగల్చరు!

గోధుమపిండిలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లతో ముద్దగా చేసి పక్కనుంచాలి. 

ఇప్పుడు కడాయిలో బెల్లం, మూడు కప్పుల నీరు పోయాలి.

బెల్లం మరుగుతుండగా వేగించి చల్లార్చి ఉంచిన రవ్వ, యాలకుల పొడి, రెండు టేబుల్‌ స్పూన్లు నెయ్యి వేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. 

మిశ్రమం బాగా చిక్కబడ్డాక దించాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి.

 గోధుమపిండి ముద్దను పూరీలుగా వత్తి, మధ్యలో రవ్వ మిశ్రమం పెట్టి అంచులు మడవాలి. 

తర్వాత చేత్తో వత్తి పెనంపై నెయ్యితో రెండువైపులా దోరగా వేగిస్తే రుచికరమైన రవ్వ బొబ్బట్లు తయారు.