చలికాలంలో కార్లతో సమస్యలు రాకూడదంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి

సమయానికి కారుకు సర్వీసింగ్ చేయస్తే రాబోయే సమస్యలను ముందుగానే గుర్తించొచ్చు

కారు డోర్లు, రియర్ వ్యూ మిర్రర్లు, అద్దాలు శుభ్రంగా ఉంచితే పొగమంచుతో ఇబ్బందులు తగ్గుతాయి

కార్ల లైట్లు, వైపర్ బ్లేడ్స్‌ను చెక్ చేసుకోవాలి. వాషర్ ఫ్లూయిడ్ ట్యాంకు నిండుగా ఉంచాలి

కారులోని లైట్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయాలి. కారులోపల ఉష్ణోగ్రత తగిన విధంగా సెట్ చేయాలి

చలికాలంలో బ్యాటరీ సమస్యలు వస్తాయి. కాబట్టి, ఇంజిన్‌తో పాటూ బ్యాటరీని తరచూ చెక్ చేయాలి 

కారు ఇంజిన్ ఆయిల్, కూలెంట్ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

చలికాలంలో రోడ్లపై తేమతో ప్రమాదాలు జరగొచ్చు. కాబట్టి, అవసరమైతే బ్రేకులకు కొత్త ప్యాడ్స్ వేయాలి

టైర్లలో తగినంత గాలి లేకపోయినా, అవి అరిగిపోయినా మంచు కారణంగా ప్రమాదాలు తప్పవు

కారులో ఎక్కడికెళ్లినా వెంట మొబైల్ చార్జర్, పవర్ బ్యాంక్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు