శీతాకాలంలో స్వెట్టర్లు వినియోగించడం మామూలే. మరి వాహనాలకూ స్వెట్టర్లు తొడిగితే ఎలా ఉంటుందో చూడాలని ఓ వ్యక్తి (sahixd) మిడ్‌జర్నీ సాయంతో అనేక ఏఐ చిత్రాలను రూపొందించాడు.

శీతాకాల స్వెట్టర్‌లో సైకిల్ అందం మరింత పెరిగిందనే చెప్పాలి. సైకిల్ కోసమే కొత్తగా ఈ స్వెట్టర్‌ను డిజైన్ చేశారేమో అనిపిస్తోంది.

బస్సు మూమూలుగానే గొప్పగా కనిపిస్తుంది. పైగా దీనికీ స్వెట్టర్ తొడగడంతో మరింత ఆకర్షణంగా ఉంది. 

గాల్లో దూసుకెళ్లే విమానం.. చలికాల స్వెట్టర్‌లో మరింత ముద్దొస్తోంది. భారీ తిమింగళానికి రక్షణ కవచం తొడిగినట్లుగా అనిపిస్తోంది. 

మంచుపొగ మధ్యలో దూసుకొస్తున్న రైలుకు స్వెట్టర్ వేయడంతో మరింత అందంగా కనిపించింది. 

అలాగే చలికి తట్టుకునేలా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు స్వెట్టర్ తొడిగాడు. దీంతో దాని రాజసం మరింత పెరిగిందనే చెప్పాలి. 

స్కార్పియో కారుకు స్వెట్టర్ వేయడంతో పులి దూసుకొస్తున్నట్లుగా కనిపించి కనువిందు చేసింది. 

ఆటోకు స్వెట్టర్ వేయడంతో చిన్న పిల్లాడు తలకు టోపీ పెట్టుకున్న తరహాలో కనిపించింది. 

స్కూటీకి చలికాల స్వెట్టర్ వేయగా.. అదేదో అందమైన వింత జంతువులా కనిపించి అందరినీ ఆకట్టుకుంటోంది. 

ఓల్డ్ మోడల్ లారీకి ఏఐ టెక్నాలజీ సాయంతో స్వెట్టర్ వేయగా.. దాని అందం చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. 

పాత కాలపు టాక్సీ కారుకు పసుపు రంగు స్వెట్టర్ వేయగా.. జిగేల్ మంటూ మెరిసిపోతూ కనిపిస్తోంది.