ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ జరిగింది.

ఇసుక కుంభకోణంపై సభలో ప్రశ్నించిన పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు

జేపీ వెంచర్స్ రూ.842కోట్లు బకాయి పడినా గత ప్రభుత్వం ఎన్‌వోసీ ఇచ్చిందన్న మంత్రి కొల్లు రవీంద్ర

ఇసుక తవ్వకాలపై శాటిలైట్ ఇమేజెస్ ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు కొల్లు రవీంద్ర వెల్లడి

ప్రశ్నోత్తరాల సమయంలో కృష్ణపట్నం పోర్టు అంశంపై చర్చ

తరలిపోయిన కంటైనర్ పోర్టు కోసం అదానీ కాళ్లు పట్టుకుంటానన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి

కంటైనర్ పోర్టు వెళ్లిపోవడంతో 10వేల మంది ప్రత్యక్షంగా ఉపాధిని కోల్పోయారన్న సోమిరెడ్డి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సభలో బిల్లు ప్రవేశపెట్టిన రెవెన్యూ మంత్రి అనగాని

ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రిపీల్ బిల్లు 2024ను ఆమోదించిన ఏపీ శాసనసభ

జీవో 217ను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి

వైసీపీ హయాంలో తెచ్చిన ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

మద్యం పేరుతో ఇష్టారాజ్యంగా దోచుకున్నారని సీఎం విమర్శలు