లగచర్ల ఘటనపై కేటీఆర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు

మణిపుర్‌ గురించి తరచూ మాట్లాడే రాహుల్‌ గాంధీ తెలంగాణ గురించి ఎందుకు స్పందించడం లేదు?

తెలంగాణలో ఎన్ని దురాగతాలు జరుగుతున్నా ముఖ్యమంత్రిని నియంత్రించరా?

కష్టమొచ్చినప్పుడు ఒక్క పిలుపునిస్తే వెంటనే వస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన రాహుల్‌ ఇప్పుడెక్కడున్నారు?

పేదలను కాపాడే విధానం ఇదేనా? అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు

తెలంగాణలో జరుగుతున్న దురాగతాలపై స్పందించే బాధ్యత తనపై,  ఉందని ప్రధాని మోదీకి గుర్తున్నట్లు లేదు

ఆడవాళ్లపై దాదాపు అత్యాచారం చేసినంత పనిచేశారని కమిషన్లకు బాధితులు మొరపెట్టుకున్నారు

దీనిపై ప్రధాని మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించకపోతే ఎలా?

బాధిత కుటుంబ సభ్యులకు  బెయిళ్లు వచ్చి జైలు నుంచి విడుదలయ్యేదాకా, 

పోరాటం ముగింపు వచ్చేదాకా బీఆర్ఎస్ అండగా ఉంటుంది అని కేటీఆర్‌ పేర్కొన్నారు