పారిస్‌ ఒలింపిక్స్‌‌లో టీమ్ ఈవెంట్స్ ప్రారంభం

33వ ఒలింపిక్స్‌ పోటీల్లో భాగంగా బుధవారం సాకర్‌, రగ్బీ సెవెన్స్‌ మ్యాచ్‌లతో టీమ్ ఈవెంట్స్ ప్రారంభమయ్యాయి

స్పెయిన్‌-ఉజ్బెకిస్థాన్‌ మధ్య జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌తో అంతర్జాతీయ ఆటల పండుగ మొదలైంది

గురువారం ఆర్చరీ, హ్యాండ్‌బాల్‌ రగ్బీ సెవెన్స్‌, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి

ఆర్చరీలో భాగంగా గురువారం భారత ఆర్చర్లు తొలి పరీక్ష ఎదుర్కొనున్నారు

ప్రారంభోత్సవ కార్యక్రమాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ సిద్ధమయ్యాయి

పారిస్‌లో రేపు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాల తర్వాత ఒలింపిక్స్‌ అధికారికంగా మొదలుకానున్నాయి

ఇటీవలే యూరో కప్‌ గెలిచిన జోష్‌లో ఉన్న స్పెయిన్‌ తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టింది

ఈ ఒలింపిక్స్‌లో జులై 27న టెన్నిస్ ప్రారంభ రౌండ్ మ్యాచ్‌లతో ప్రారంభమవుతుంది

పురుషుల సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌తో సహా చివరి పతక మ్యాచ్‌లు ఆగస్టు 4 వరకు జరుగుతాయి