టెస్టు క్రికెట్‌ రికార్డులు చిత్తు చిత్తు చేసిన భారత మహిళలు

దక్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న ఐకైక టెస్టులో ఉమెన్స్ టీమిండియా తొలి రోజే అదరగొట్టింది

టెస్టులో మొదటి రోజే మహిళలు ఐదొంద‌లకుపైగా స్కోర్ చేసి రికార్డు సృష్టించారు

ఈ క్రమంలో షఫాలీ వర్మ (205), స్మృతీ మంధాన (149), జెమీమా రోడ్రిగ్స్‌ (55), హర్మన్‌ప్రీత్ కౌర్ (69) రన్స్ చేసి వావ్ అనిపించారు

దీంతో మహిళల టెస్టు చరిత్రలో షఫాలీ అత్యంత వేగంగా 194 బంతుల్లోనే ద్విశతకాన్ని చేసింది

ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక (8) సిక్సర్లతో కూడా షఫాలీ ప్రపంచ రికార్డు సృష్టించింది

భారత్‌ తరఫున డబుల్‌ సెంచరీ చేసిన రెండో మహిళా బ్యాటర్‌గా షఫాలీ రికార్డుకెక్కింది

22 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ (214) ఈ ఘనత సాధించింది

తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్‌ 4 వికెట్లకు 525 పరుగుల భారీ స్కోరు చేసింది

ఓవరాల్‌గా (పురుషులు, మహిళల) టెస్టు చరిత్రలో ఒకరోజు అత్యధిక పరుగులు (525) చేసిన తొలి జట్టుగా భారత్‌ నిలిచింది

అంతకుముందు 2002లో బంగ్లాదేశ్‌తో టెస్టులో రెండోరోజు ఆటలో శ్రీలంక పురుషుల జట్టు చేసిన 509/9 స్కోరే అత్యధికం