GEPIL: ఎన్టీపీసీ రామగుండం పవర్ ప్లాంట్ సామర్థ్యం పెంపు.. ప్రాజెక్టును పూర్తి చేసిన జీఈ స్టీమ్ పవర్, ఎన్జీఎస్ఎల్

ABN , First Publish Date - 2022-12-02T17:59:11+05:30 IST

రామగుండంలోని ఎన్టీపీసీ రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, 3X200 M W1 యూనిట్ 1,3 లలో 2021, 2022లలో పూర్తయిన

 GEPIL: ఎన్టీపీసీ రామగుండం పవర్ ప్లాంట్ సామర్థ్యం పెంపు.. ప్రాజెక్టును పూర్తి చేసిన జీఈ స్టీమ్ పవర్, ఎన్జీఎస్ఎల్

హైదరాబాద్: రామగుండంలోని ఎన్టీపీసీ రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, 3X200 M W1 యూనిట్ 1,3 లలో 2021, 2022లలో పూర్తయిన స్టీమ్ టర్బైన్ పునరుద్ధరణ, ఆధునీకకరణ ప్రాజెక్ట్ సాధించినఫలితాలను జీఈ పవర్ ఇండియా లిమిటెడ్ (GEPIL), ఎన్జీఎస్ఎల్ (NGSL)కన్సార్టియం లోని దాని అనుబంధ సంస్థలు ప్రకటించాయి.

ఎన్టీపీసీ చేపట్టిన శక్తిసామర్థ్య స్టీమ్ టర్బైన్ ప్రాజెక్ట్‌‌‌లలో ఇది మొదటిది. ఉత్పత్తి, పనితీరుపై అంగీకరించిన కాంట్రాక్టు కమిట్‌మెంట్‌ల కంటే మెరుగైన దాన్ని బృందం అందించగలిగింది. ఈ యూనిట్ల హీట్ రే‌ట్ కోసం అత్యుత్తమ పనితీరు ప్రమాణాలను నెలకొల్పింది. 1,3 యూనిట్ల విజయం తరువాత బృందం ఇప్పుడు యూనిట్ 2 వ్యవస్థాపన, నిర్వహణ కోసం సిద్ధమవుతోంది.

రెండు యూనిట్ల నుండి ఉత్పత్తి చేసిన 20 మెగావాట్ల అదనపు ఉత్పత్తి సుమారు 44,100 గృహాలకు విద్యుత్తును అందిస్తుంది. భరత ప్రభుత్వం చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి మద్దతుగా ప్రాజెక్ట్ అవసరాలలో కొన్ని భాగాలు భారతదేశం నుంచి స్థానికంగా సమకూర్చుకున్నారు. ఎల్‌పీ టర్బైన్ తయారీ, సరఫరా గుజరాత్‌ లో‌ని సనంద్‌లోని జీఈ కేంద్రం ద్వారా జరిగాయి. భారతదేశంలోని వివిధ విక్రేతల నుంచి క్లిష్టమైన సహాయక భాగాలను సేకరించారు.

ఈ సందర్భంగా జీఈ స్టీమ్ పవర్ ఆర్జీఎం, జీఈ పవర్ ఇండియా లిమిటెడ్ ఎండీ ప్రశాంత్ జైన్ మాట్లాడుతూ..కస్టమర్‌కు అంగీకరించిన దానికంటే ఎక్కువగా ఫలితాలను అందించిన బృందాన్ని చూసి గర్వపడుతున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ మరింత సమర్థవంతమైన, సౌకర్యవంతమైన విద్యుత్ ఉత్పత్తి పరిష్కారాల సహాయంతో భారతదేశపు డీకార్బనైజేషన్ ప్రయాణానికి మద్దతు ఇస్తుందన్నారు. ఇలాంటి అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్‌‌ల శక్తి, సామర్థ్యం, విశ్వసనీయతను పెంచడం, ఉద్గారాలను తగ్గించడంతోపాటు భవిష్యత్తులో ఇంధన అవసరాలను తీర్చడంలో దేశాన్ని మరింత మెరుగ్గా ఉంచుతాయని అన్నారు.

2017లో జీఈ స్టీమ్ పవర్ బీహెచ్ఈఎల్ 200-MW తరగతి యూనిట్లకు సంబంధించి ఉకాయ్ థర్మల్ పవర్ స్టేషన్ కోసం ఈ తరహాలో స్టీమ్ టర్బైన్ షాఫ్ట్ లైన్ రెట్రోఫిట్‌ను పూర్తి చేసింది. ఇది ఉద్గారాలను తగ్గించడంతోపాటు శక్తి, సామర్థ్యం, విశ్వసనీయతను పెంచే లక్ష్యంతో ఉంది. రెట్రోఫిట్ అనేది యూనిట్ జీవితాన్ని 25 సంవత్సరాలు పొడిగించడమే కాకుండా, దాని ఉత్పత్తిని దాని అసలు సామర్థ్య మైన 200 MWకి పునరుద్ధరించింది.

Updated Date - 2022-12-02T17:59:41+05:30 IST