Redmi: నోట్ 12 సిరీస్‌లో 5జీ ఫోన్లను విడుదల చేసిన షావోమీ

ABN , First Publish Date - 2022-10-28T21:31:14+05:30 IST

రెండ్‌మీ నోట్ 12 ప్రొ, ప్రొ ప్లస్‌ల మధ్య తేడా మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్‌సెట్ మాత్రమే. వీటితోపాటు వినియోగదారులను

Redmi: నోట్ 12 సిరీస్‌లో 5జీ ఫోన్లను విడుదల చేసిన షావోమీ

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ షావోమీ రెడ్‌మీ నోట్ 12, రెడ్‌మీ నోట్ 12 ప్రొ, రెడ్‌మీ నోట్ 12 ప్రొ ప్లస్‌లను చైనలో లాంచ్ చేసింది. ఆకట్టుకునేలా ఉన్న ఈ ఫోన్లలో ఓలెడ్ డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 ఎంపీ సెల్ఫీ షూటర్ వంటివి ఫీచర్లు ఉన్నాయి. రెండ్‌మీ నోట్ 12 ప్రొ, ప్రొ ప్లస్‌ల మధ్య తేడా మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్‌సెట్ మాత్రమే. వీటితోపాటు వినియోగదారులను ఆకర్షించే మరెన్నో ఫీచర్లను షావోమీ(Xiaomi) ఇందులో జోడించింది. ఇవన్నీ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. రెడ్‌మీ నోట్ 12 ప్రొలో 50 మెగాపిక్సల్‌ ప్రధాన కెమెరా ఉండగా, రెడ్‌మీ నోట్ 12 ప్రొ ప్లస్‌లో 200 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను ఉపయోగించారు. రెడ్‌మీ నోట్ 12 5జీలో 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా ఉపయోగించారు.

రెడ్‌మీ నోట్ 12(Redmi Note 12) 4జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర ధర భారత్‌లో రూ. 13,600 వరకు ఉండే అవకాశం ఉండగా, 6జీబీ ర్యామ్-128జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 14,600 వరకు ఉండే అవకాశం ఉంది. ఇందులోనే 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 17 వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఇందులో టాప్ ఎండ్ మోడల్ అయిన 8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర మన కరెన్సీలో రూ. 19,300గా ఉండే అవకాశం ఉంది.

రెడ్‌మీ నోట్ 12 ప్రొ( Redmi Note 12 Pro) 6జీబీ+128జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 19,300, 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 20,400, 8జీబీ+256జీబీ స్టోరేజీ ధర రూ.22,700, టాప్ మోడల్ అయిన 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 24,900 ఉండే అవకాశం ఉంది. ఇక, రెడ్‌మీ నోట్ 12 ప్రొ ప్లస్(Redmi Note 12 Pro+) 8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 23 వేలు, 12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 26 వేలు ఉండే అవకాశం ఉంది. ఈ మూడు స్మార్ట్ ఫోన్లు మిడ్‌నైట్ డార్క్, టైమ్ బ్లూ, మిర్రర్ పోర్సెలైన్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 12 ప్రొ అదనంగా షాలో డ్రీమ్ గెలాక్సీ షేడ్‌లో వస్తోంది. రెడ్‌మీ నోట్ 12 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్(Redmi Note 12 Explorer Edition) 8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 27,200, రెడ్‌మీ నోట్ 12 ట్రెండ్ ఎడిషన్ 8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 29,500గా ఉండే అవకాశం ఉంది.

Updated Date - 2022-10-28T21:31:16+05:30 IST