SBI ATM Card ఉందా..? అయితే తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయమిది..!

ABN , First Publish Date - 2022-11-21T21:55:00+05:30 IST

ఎస్బీఐ ఏటీఎం కార్డుతో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్

SBI ATM Card ఉందా..? అయితే తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయమిది..!

ఇంటర్నెట్ డెస్క్: బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతివ్యక్తి దగ్గరా ఉండేది ఏటీఎం కార్డు. దీంతో..ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. షాపింగ్ చేయచ్చు. అయితే..డెబిట్ కార్డుతో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా పొందచ్చన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ బ్యాంకు ఈ సదుపాయం కల్పిస్తోంది. ఎస్బీఐ ఏటీఎం కార్డు ఉంటే ఏకంగా 20 లక్షల వరకూ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పొందవచ్చు. ప్రమాదంలో మరణించిన వారికి ఈ మొత్తం ఇస్తారు. ఎస్బీఐ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. ఇది కాంప్లిమెంటరీగా ఇచ్చే ఇన్సూరెన్స్.

ఇక ఏటీఎం కార్డును బట్టి బీమా మొత్తం మారుతుంది. గరిష్ఠంగా 20 లక్షల వరకూ లభిస్తుంది. యాక్సిడెంట్ జరిగిన నాటికి తొంభై రోజుల వ్యవధిలో కనీసం ఒకసారైనా ఏటీఎం కార్డు వినియోగించిన వారికి ఈ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఏటీఎం కార్డుదారు మరణించాక సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించి బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఎస్బీఐ కార్డు

విమానప్రమాదంలో మరణిస్తే..

ఇతరత్రా ప్రమాదాల్లో మరణిస్తే..

ఎస్బీఐ గోల్డ్,

రూ. 4 లక్షల వరకూ

రూ.2లక్షలు వరకూ

ఎస్బీఐ ప్లాటినం

రూ. 10 లక్షల వరకూ

రూ. 5లక్షల వరకూ

ఎస్బీఐ ప్రీమియం ప్రైడ్

రూ. 4 లక్షల వరకూ

రూ.2 లక్షల వరకూ

ఎస్బీఐ ప్రీమియం

రూ. 10 లక్షల వరకూ

రూ. 5 లక్షల వరకూ

ఎస్బీఐ వీసా

రూ. 20 లక్షల వరకూ..

రూ. 10 లక్షల వరకూ

Updated Date - 2022-11-22T00:07:16+05:30 IST