ఐస్‌క్యూబ్స్‌తో అందానికి మెరుగు!?

ABN , First Publish Date - 2022-10-25T23:58:44+05:30 IST

ఐస్‌క్యూబ్స్‌తో చర్మానికి సరికొత్త అందాన్ని తీసుకురావచ్చు. చర్మం, మెడ మీద ఉండే నొప్పులు తగ్గిపోతాయి. దీంతో పాటు నలుపు మచ్చలు, పేరుకున్న మట్టి తొలగిపోతాయి.

ఐస్‌క్యూబ్స్‌తో అందానికి మెరుగు!?

ఐస్‌క్యూబ్స్‌తో చర్మానికి సరికొత్త అందాన్ని తీసుకురావచ్చు. చర్మం, మెడ మీద ఉండే నొప్పులు తగ్గిపోతాయి. దీంతో పాటు నలుపు మచ్చలు, పేరుకున్న మట్టి తొలగిపోతాయి. బ్లడ్‌ సర్క్యులేషన్‌ మెరుగవ్వటంతో పాటు చర్మంలోని నూనెశాతాన్ని తగ్గించే ఈ ఐస్‌ క్యూబ్స్‌ బ్యూటీ టిప్స్‌ను తెలుసుకుందాం.

  • తులసి, అలొవెరా ఆరోగ్యమే కాదు.. చర్మ సౌందర్యానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఒక బౌల్‌లో నీళ్లు తీసుకుని అందులో తులసి ఆకుల్ని నలిపి వేయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల అలొవెరా జెల్‌ను వేసి బాగా కలపాలి. ఆ నీటిని ఐస్‌క్యూబ్స్‌ ట్రేలో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ ఐస్‌క్యూబ్స్‌తో చర్మాన్ని రుద్దితే ముఖం మీద నొప్పులతో పాటు వేడివల్ల వచ్చిన మచ్చలు పోతాయి.

  • ఐస్‌క్యూబ్స్‌ ట్రేలో ఒక కప్పు రోజ్‌వాటర్‌తో పాటు కప్పు మంచి నీళ్లు కలపాలి. ఫ్రీజర్‌లో ఉంచాలి. ఆ ఐస్‌క్యూబ్స్‌తో మెల్లగా చర్మంపై రుద్దితే ముడతలు తగ్గిపోతాయి. స్కిన్‌ ఇన్‌ఫెక్షన్స్‌ దరికి చేరవు. దీంతో పాటు ముఖం ఫ్రెష్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది.

  • బౌల్‌లో దోసకాయ ముక్కలను క్రష్‌ చేసి వేయాలి. వెంటనే ఐదారు చుక్కల నిమ్మరసం కలపాలి. ఇందులో ఐస్‌క్యూబ్స్‌ వేసి కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి.. తీసిన వెంటనే వేగంగా ముఖంపై రబ్‌ చేయాలి. బ్లడ్‌ సర్క్యులేషన్‌ సాఫీగా జరిగి నొప్పులు, మొటిమలు తగ్గిపోతాయి. ముఖం మీద రెడ్‌నెస్‌ తగ్గిపోతుంది.

  • చర్మ సౌందరానికి కుంకుమ పువ్వుకి సాటి లేదు. కుంకుమ పువ్వును కొంచెం రోజ్‌ వాటర్‌లో కలపాలి. బాగా మిక్స్‌ చేశాక.. ఐస్‌ క్యూబ్స్‌ ట్రేలో వేసి క్యూబ్స్‌ తయారు చేసుకోవాలి. వాటితో ఫేస్‌మీద రబ్‌ చేస్తే పిగ్మెంటేషన్‌, నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. ముఖ్యంగా స్కిన్‌టోన్‌ మారిపోతుంది. ముఖంలో మార్పు మీరు గమనిస్తారు.

  • ఇలానే పసుపు, రోజ్‌ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్‌ తయారు చేసుకుని ముఖం మీద మసాజ్‌ చేసినట్లు రుద్దితే పిగ్మెంటేషన్‌తో పాటు కళ్ల కింద మచ్చలు తగ్గిపోతాయి. యంగ్‌ లుక్‌లో కనిపిస్తారు. మొత్తానికి ఈ ఐస్‌క్యూబ్స్‌తో అందానికి మెరుగులు దిద్దుకోవటం వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు చేకూరటంతో పాటు మసాజ్‌ చేయటం వల్ల ఫ్రెష్‌గా అనిపిస్తుంది. రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది కాబట్టి ఒత్తిడి శాతం తగ్గిపోతుంది.

Updated Date - 2022-10-26T00:16:07+05:30 IST