Fighting With Your Wife: భార్యతో పోట్లాడుతున్నప్పుడు గుర్తుంచుకోవలసిన 5 విషయాలు ఇవే..
ABN , First Publish Date - 2022-11-15T15:10:19+05:30 IST
ఇద్దరి మధ్య జరిగే ఈ చిన్ని చిన్ని తగాదాలు సమయం గడిస్తే ఇట్టే తొలగిపోతాయనేది గుర్తుంచుకోవాలి.
మనలో చాలా మందికి వాదనలో గెలవడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. మన వాదనకు ప్రత్యర్థి నోరు మెదపలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ మైక్ డ్రాప్ క్షణంలో చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. భార్యతో పోట్లాడుతున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవే..
1. వాదనలో ఉన్నప్పుడు..
కొన్నిసార్లు మనం చెప్పాలనుకున్నదానికంటే ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటాం. దాని పర్యావసానాలు అసలు దృష్టిలో పెట్టుకోం. ఇదంతా గొడవ పెరగడానికి అసలు పెద్ద కారణం అవుతుంది.
2. వాళ్లు శత్రువులు కాదు.
వివాహ పోరులో ఇద్దరు కొట్టుకోవడం అనేది సర్వ సాధారణం. కానీ ఇద్దరి మధ్య జరిగే ఈ చిన్ని చిన్ని తగాదాలు సమయం గడిస్తే ఇట్టే తొలగిపోతాయనేది గుర్తుంచుకోవాలి. ఈగోలకు పోకూడదు. భార్యాభర్తలు ఇద్దరూ శత్రువులు కారనేది గుర్తుంచుకోవాలి.
3. ఎవరు ఒడినా ఇద్దరూ గెలవనట్టే..
వివాహ పోరులో ఇద్దరిలో ఎవరు ఒడినా ఇద్దరూ గెలవనట్టే లెక్క. సమస్య చిన్న దైనా పెద్దదైనా ఇద్దరూ కలిసి మాట్లాడుకుని చర్చించుకోవాలి. పరిష్కారాలు వెతకాలి, దానికి వాదులాటలే మార్గం కాదు.
4. తప్పు చేస్తున్నారనేది గమనించండి.
మాటల యుద్ధంలో నోరు జారి మాటలు వదిలేస్తున్నారనేది గమనించండి. తప్పుచేస్తున్నారనే ఎరుక అవసరం. మాటలతో ఎదుటివారిని బాధ పెట్టడం సరైనది కాదు.
5. ఎందుకు కోపం వస్తుంది.. ఆలోచించండి.
మాటల యుద్ధానికి నోరు జారడం ఎంత తప్పో, కోపం కూడా అంతే అనర్థాన్ని తెస్తుంది. మాటలు కోపంతో మరింత వెడెక్కుతాయి. ఇద్దరి మధ్యా మనస్పర్థలు తెచ్చిపెడతాయి. తరచుగా, చిన్న పొరపాటును కూడా భూతద్ధంలో చూస్తూ అగౌరవంగా, భయంగా, ఇబ్బందిగా భావించడం వల్ల కోపంగా ఉంటాం. వివాహ బంధంలో పరిస్థితి వేడెక్కుతున్నట్లు గుర్తించినప్పుడు, గొడవను అంతటితో ఆపివేయడం, సర్దుకుపోవడం అందరికీ మంచిది.